మహిళల ఐపీఎల్‌ను మొదలుపెట్టనున్న బీసీసీఐ

హైదరాబాద్: మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వహించాలనే యోచనలో బీసీసీఐ యోచిస్తోంది. ఈ ప్రతిపాదన దిశగా ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. ఈ క్రమంలోనే మే 22న ముంబైలో ఐపీఎల్ ప్లేఆఫ్‌కు ముందు ప్రయోగాత్మకంగా మహిళల టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ మ్యాచ్ కోసం 20 మంది భారత మహిళా క్రికెటర్లతో పాటు పది మంది విదేశీయులు సాధన చేయబోతున్నారు.

రెండు జట్లను ఐపీఎల్ ఎలెవన్ .. బీసీసీఐ ఎలెవన్:
వీరి నుంచి రెండు జట్లను తయారు చేస్తారు. ఐపీఎల్ ఎలెవన్ ఒక జట్టు కాగా.. మరొకటి బీసీసీఐ ఎలెవన్. ఐపీఎల్‌లో మాదిరే ఒక్కో జట్టులో ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీయులు ఉంటారు. 22న మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ మ్యాచ్ ఆరంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయనుంది.

పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను బీసీసీఐ..:
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ బోర్డుల్ని సంప్రదించి ఈ మ్యాచ్‌లో పాల్గొనే విదేశీ క్రికెటర్ల పేర్లను బీసీసీఐ ప్రకటించనుంది. భారత అమ్మాయిల వివరాలను సెలక్షన్ కమిటీ వెల్లడిస్తుంది. 'భారత మహిళల-ఏ జట్టుకే ఇంకా నాణ్యమైన క్రీడాకారులు కావాలి. అలాంటి వాళ్లు ఉన్నప్పుడే మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలి. అప్పుడే దానికి అర్థముంటుంది' అని ఆమె చెప్పింది.

నాణ్యమైన క్రీడాకారిణులు ఉన్నప్పుడే ఐపీఎల్:
ఈ మ్యాచ్ గురించి గతంలో మహిళల టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ ఇలా స్పందించారు. 'ఇప్పుడే ఐపీఎల్‌ను నిర్వహిస్తే మహిళల క్రికెట్ వ్యాప్తికే అది ప్రతికూలంగా మారొచ్చు. పటిష్టమైన దేశవాళీ వ్యవస్థ, చాలా మంది నాణ్యమైన క్రీడాకారిణులు ఉన్నప్పుడే ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం' అని మిథాలీ విలేకర్లతో చెప్పింది.

జులన్ గోస్వామి కూడా అంగీకరించి:
మిథాలీతో వెటరన్ పేస్ బౌలర్ జులన్ గోస్వామి కూడా అంగీకరించింది. ''ఆమె చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తా. దేశవాళీ వ్యవస్థ ఇంకా బలపడాలి'' అని అంది. భారత మహిళల జట్టుకు రిజర్వ్‌బెంచ్ బలంగా లేదని మిథాలీరాజ్ ఒప్పుకుంది. తర్వాతి తరం అంతర్జాతీయ క్రికెటర్లు తయారు కావడానికి కనీసం మరో రెండేళ్ల సమయం పడుతుందని చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications