Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. సెలెక్షన్ కమిటీ ఉద్యోగాలు ఊస్ట్!

 BCCI sacks selection committe led b chetan sharma

ఇటీవలి కాలంలో భారత జట్టు బడా వేదికలపై చేతులెత్తేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆసియా కప్ ఫైనల్ కూడా చేరలేకపోయిన టీమిండియా.. ప్రపంచకప్‌లో కూడా సెమీస్‌లో ఇంగ్లండ్ వంటి బలమైన ప్రత్యర్థి ఎదురవగానే తడబడింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ రెండు సిరీసులకు జట్టును ప్రకటించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్టర్లు ఏ ఆలోచనతో టీంను ఎంపిక చేస్తున్నారంటూ అభిమానులు, మాజీలు ప్రశ్నించారు.

 బీసీసీఐ కఠిన నిర్ణయం

బీసీసీఐ కఠిన నిర్ణయం

కొన్నిరోజుల క్రితం సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ.. సెలెక్షన్ కమిటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. చెప్పినట్లే సెలెక్షన్ కమిటీపై కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టుపై కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ సహా అందర్నీ తొలగిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది బీసీసీఐ.

చేతన్ శర్మ టీంపై విమర్శలు

చేతన్ శర్మ టీంపై విమర్శలు

ఆసియా కప్ వైఫల్యం తర్వాత సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదని మాజీలు, అభిమానులు విమర్శించారు. ఇక టీ20 ప్రపంచకప్ ఓటమి తర్వాత ఇది ఆగ్రహంగా మారింది. ఆ తర్వాత న్యూజిల్యాండ్ సిరీస్‌కు కూడా సరైన జట్టును ఎంపిక చేయకపోవడంతో అభిమానులు తిట్టిపోస్తున్నారు. చేతన్ శర్మ అండ్ కో బృందం పనితీరు కూడా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎలాంటి మాటలూ లేకుండా సడెన్‌గా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించేసిన వివాదాస్పద నిర్ణయం కూడా ఈ బృందమే తీసుకున్న సంగతి తెలిసిందే.

దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

చేతన్ శర్మ సహా మొత్తం సెలెక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం ఏడు అంతర్జాతీయ టెస్టు మ్యాచులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచులు లేదా పది వన్డే, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన వారు ఈ పదవులకు అర్హులని ప్రకటించింది. అలాగే క్రికెట్ నుంచి కనీసం ఐదేళ్ల క్రితం రిటైర్ అయ్యి ఉండాలని తెలిపింది. ఈ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటలు అని వెల్లడించింది. మరి ఈ పదవుల కోసం ఎవరు దరఖాస్తులు చేస్తానో చూడాలి.

Story first published: Saturday, November 19, 2022, 8:33 [IST]
Other articles published on Nov 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+