Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఖర్చు తగ్గించుకునే పనిలో బీసీసీఐ.. ఇకనుంచి చీఫ్ సెలక్టర్‌కి బిజినెస్ క్లాస్!!

BCCIs cost cutting measures: only chief selectors will get to fly business class

ముంబై: భారతదేశ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. బీసీసీఐ చెప్పిందే ఐసీసీకి వేదం. అలాంటి బీసీసీఐ కూడా కరోనా వైరస్ దెబ్బకు కుదేలవుతోంది. తనపై భారం పడకుండా బీసీసీఐ ఇప్పటినుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ తమ అధికారులకు విమాన క్లాస్ (ఎకానమీ-బిజినెస్) ప్రయాణాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

చీఫ్ సెలక్టర్‌‌‌కి బిజినెస్ క్లాస్ టికెట్:

చీఫ్ సెలక్టర్‌‌‌కి బిజినెస్ క్లాస్ టికెట్:

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌‌కి విమాన ప్రణయంలో బిజినెస్ క్లాస్ టికెట్లని కేటాయిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ఇప్పటి వరకూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌తో పాటు సెలక్టర్లు కూడా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేవారు. అయితే ఆర్ధిక భారం పడకుండా.. బీసీసీఐ తాజాగా కేటగిరీని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యటనలో (ఏడు గంటల పైగా ప్రయాణం ఉండే సమయంలో) మాత్రం అందరికీ బిజినెస్ క్లాస్ టికెట్లని కేటాయించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

సెలక్టర్లతో పాటు టీం జనరల్ మేనేజర్‌కి కూడా:

సెలక్టర్లతో పాటు టీం జనరల్ మేనేజర్‌కి కూడా:

మొన్నటివరకు టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం ఇటీవల ముగియడంతో.. అతని స్థానంలో సునీల్ జోషిని సీఏసీ సభ్యులు ఎంపికైన విషయం తెలిసిందే. అతనితో పాటు ఇప్పుడు సెలక్షన్ కమిటీలో హరీందర్ సింగ్, దేవాంగ్ గాంధీ, సరన్‌దీప్ సింగ్, జతిన్ పరన్‌జపే ఉన్నారు. విదేశీ పర్యటన సమయంలో సెలక్టర్లతో పాటు టీం జనరల్ మేనేజర్‌కి కూడా బిజినెస్ క్లాస్‌ టికెట్‌ని కేటాయించబోతున్నారు.

ఐపీఎల్ ప్రైజ్ మనీ తగ్గింపు:

ఐపీఎల్ ప్రైజ్ మనీ తగ్గింపు:

ఐపీఎల్ నాకౌట్ దశలోకి ప్రవేశించే జట్లకు బీసీసీఐ ఇటీవల ప్రైజ్ మనీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌‌కి విమాన ప్రణయంలో బిజినెస్ క్లాస్ టికెట్లని తగ్గించింది. చిన్న చిన్న ఖర్చు తగ్గించుకుంటేనే బీసీసీఐకి చాలా డబ్బు ఆదా చేయగలవని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ఇటీవల అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ రద్దయితే:

ఐపీఎల్ రద్దయితే:

ఐపీఎల్ 2020 రద్దయితే బీసీసీఐ భారీగా ఆదాయం కోల్పోతుంది. అయితే కరోనా పరిస్థితులు ఎలాగుంటాయో ప్రస్తుతానికి ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో ఏప్రిల్‌ 15 తర్వాత ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఐపీఎల్‌ను జూన్‌-సెప్టెంబర్ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. ఐపీఎల్‌-2009ని దక్షిణాఫ్రికాలో 37 రోజులు నిర్వహించారు. ఇప్పుడూ పరిస్థితులు అనుకూలిస్తే కొన్ని రోజులు విదేశాల్లో, కొన్ని రోజులు స్వదేశంలో నిర్వహించేందుకు యోచిస్తున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని బట్టి మొత్తం టోర్నీని తరలిస్తే ఎలా ఉంటుందని చర్చించారట.

Story first published: Wednesday, March 18, 2020, 17:24 [IST]
Other articles published on Mar 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+