బీసీసీఐ కొత్త ఆలోచన: కోకాబుర్రా బంతుల స్థానంలోకి ఎస్‌జీ

Posted By:
BCCI’s contracts: CoA has questions to answer

హైదరాబాద్: సొంతగడ్డపై భారత్‌ ఆడే వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కోకాబుర్రా బంతుల స్థానంలో వైట్‌ ఎస్‌జీ బంతులు ఉపయోగించాలని బీసీసీఐ భావిస్తోంది. సోమవారం జరిగిన వార్షిక కెప్టెన్-కోచ్‌ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లు, ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు ఎస్జీ బంతులనే వాడుతున్నారు. వన్డేలకు మాత్రం కోకబుర్రా బంతులను ఉపయోగిస్తున్నారు.

 ఎస్జీ బంతులను ప్రయోగాత్మకంగా:

ఎస్జీ బంతులను ప్రయోగాత్మకంగా:

ముంబైలో జరిగిన వార్షిక దేశవాళీ కెప్టెన్‌, కోచ్‌ల సదస్సులో ఈ అంశంపై చర్చించారు. పేలవ అంపైరింగ్‌ ప్రమాణాలపై కూడా చర్చ జరిగింది. అయితే ఈ మధ్య జరిగిన ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారే టోర్నీల్లో ఎస్జీ బంతులను ప్రయోగాత్మకంగా వాడారు. ‘ఈ విషయంపై జనరల్‌ మేనేజర్‌ (క్రికెట్‌ వ్యవహారాలు) సాబా కరీమ్‌తో చర్చించాం. వచ్చే సీజన్‌లో భారత జట్టు వన్డే, టీ20ల్లో తెల్ల ఎస్‌జీ బంతులను వాడొచ్చు. ఎస్‌జీ బంతుల సీమ్‌ బాగుంటుంది. దానివైపు మొగ్గుచూపడానికి ముఖ్య కారణాల్లో ఇదొకటి'' అని ఓ రాష్ట్ర సంఘానికి చెందిన కోచ్‌ చెప్పాడు.

ఐసీసీ స్థాయిలో అంపైరింగ్‌ ప్రమాణాలు

ఐసీసీ స్థాయిలో అంపైరింగ్‌ ప్రమాణాలు

‘అంపైరింగ్‌ ప్రమాణాలపై చాలా మంది ::కెప్టెన్లు, కోచ్‌లు ఫిర్యాదు చేశారు. దేశవాళీలో అంపైర్ల నిర్ణయాలు ఎన్నో చర్చనీయాంశమయ్యాయి. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌లో భారత్‌ నుంచి ఒకే ఒక్క అంపైర్‌ (రవి సుందరం) ఉన్నాడంటేనే మన దేశంలో అంపైరింగ్‌ ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు' అని ఆ కోచ్‌ అన్నాడు.

అంపైర్ల పరీక్ష కోసం::

అంపైర్ల పరీక్ష కోసం::

ఇక అంపైర్ల వివాదాస్పద నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ డీఆర్‌ఎస్‌ను ఉపయోగించాలని కొందరు ప్రతిపాదించగా, ఆ అంశాన్ని పక్కనపెట్టారు. ఇటీవల బీసీసీఐ అంపైర్ల పరీక్ష కోసం తయారుచేసిన ప్రశ్నల్లో కొన్ని జోన్‌లకు సంబంధించిన అంపైర్లకు ప్రాథమిక ప్రశ్నలు సంధించారని, కొన్ని జోన్‌లకు మాత్రం అత్యంత కఠినమైన ప్రశ్నలు ఇచ్చారని ఆరోపించారు.

ఢిల్లీ గైర్హాజరు:

ఢిల్లీ గైర్హాజరు:

ముంబైలో జరిగిన ఈ సమావేశానికి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) గైర్హాజరైంది. ఈ ఏడాది ఢిల్లీ తరపున ముగ్గురు కెప్టెన్లుండగా ఒక్కరు కూడా సమావేశానికి హాజరుకాలేదు. రిషబ్ పంత్ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ఇషాంత్, ప్రదీప్ సాంగ్వాన్‌లలో ఒకరైనా రిప్రజెంట్ చేస్తారనుకుంటే సమావేశానికి డుమ్మా కొట్టారు.

 అంపైర్ల నూతన ప్రతిపాదనలు:

అంపైర్ల నూతన ప్రతిపాదనలు:

రంజీ ట్రోఫీలో జట్లను మూడు గ్రూపులుగా: చేయాలని కొందరు కెప్టెన్లు ప్రతిపాదించారు. మొత్తం 28 జట్లను మూడు గ్రూపులకే కుదించి, ఒక గ్రూపులో పది, మిగతా రెండు గ్రూపుల్లో తొమ్మిది చొప్పున జట్లు ఉండాలని ప్రతిపాదించారు. దీని వల్ల ఆటగాళ్లకు ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిస్తుందని తెలిపారు. దాదాపు అందరు కెప్టెన్లు దీనికి మద్దతు తెలిపారు.

Story first published: Tuesday, March 13, 2018, 12:08 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి