Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎవరికి ఎంత?: క్రికెటర్లకు డబ్బులు పంచిన బీసీసీఐ

హైదరాబాద్: 2015-16 సంవత్సరంలో జరిగిన టోర్నీలకు సంబంధించి బోర్డుకి వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని బీసీసీఐ క్రికెటర్లకు పంచింది. క్రికెటర్లతో పాటు టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, ఐపీఎల్‌ జట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు కూడా నగదుని ప్రకటించింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డు తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓపెనర్ రోహిత్‌ శర్మకి రూ.1.12 కోట్లు, రహానె రూ.1.10కోట్లు, ఉమేశ్‌ యాదవ్‌ రూ.83,63,214 మనీశ్‌ పాండే రూ.29,70,112, సురేశ్‌ రైనా రూ.32,82,757, అమిత్‌ మిశ్రా రూ.42,20,689, రవిచంద్రన్‌ అశ్విన్‌ రూ.1.01 కోట్లు, భువనేశ్వర్‌ కుమార్‌ రూ.67,99,997 కోట్లు అందుకోనున్నారు.

BCCI reveals payment details for June 2017, Anil Kumble gets Rs 48.75 lakhs; Rohit Sharma receives 1.12 crore

టీమిండియా మాజీ కోచ్ అనిల్‌ కుంబ్లేకి రూ.48 లక్షలు అందనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2017 ఫైనల్‌ నిర్వహించిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి రూ.63 లక్షలు, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ని నిర్వహించిన పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు రూ.1,69,50000 కోట్లను బీసీసీఐ ఇచ్చింది.

ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి రూ.15.75కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి రూ.21కోట్లు ఇవ్వనుంది. దీంతో పాటు విదేశీ పర్యటనలకు సంబంధించి దక్షిణాఫ్రికాకు రూ. 4,03,44,445 కోట్లు, న్యూజిలాండ్‌ బోర్డుకు రూ. 13,587,336 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+