Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ వేలం కోసం దేశవాళీ టోర్నీల షెడ్యూల్‌ను మార్చిన బీసీసీఐ

BCCI reschedules T20 Zonal, Syed Musthaq Ali tournaments for relevance

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ టీ20 జోనల్, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల తేదీలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు గురవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2018 వేలంను జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నీల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లను ఐపీఎల్ ప్రాంఛైజీలు ఎంచుకునేందు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి వేలం ప్రక్రియను బెంగళూరులోనే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్ పది సీజన్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అందరు ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. మరోవైపు ఈసారి ప్రతి ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వెసులుబాటు కొనసాగించనున్నారు. ఈ ఏడాది వేలంలో ఫ్రాంచైజీల బడ్జెట్‌ను రూ.66 కోట్లనుంచి రూ.80 కోట్లకు పెంచిన సంగతి తెలిసిందే.

రీషెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల వివరాలు:


టీ20 జోనల్ లీగ్: From: Jan 21-29 to Jan 8 -16.


సయ్యద్ ముస్తాక్ అలీ నాకౌట్: From: Feb 4-10 to Jan 21-27.


వన్డే: From: Feb 16-25 to Feb 5-14.


విజయ్ హజారే నాకౌట్: From: March 3-8 to Feb 21-26.


ప్రొఫెసర్ డీబీ దేవధర్ ట్రోఫీ: From: March 14-18 to March 4-8.


ఇరానీ కప్: Jan 11-15 to March 14-18.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 16:11 [IST]
Other articles published on Dec 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+