Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లి‌పై వేటుకు సిద్ధమైన బీసీసీఐ.. ప్లాన్ ఇదే!

భారత క్రికెట్ కోచింగ్‌లో వరల్డ్ కప్ విజేత, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శకం మొదలైంది. టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్‌ని బీసీసీఐ నియమించింది. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా గంభీరే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ఆది నుంచే ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆ అంచనాలు నిజమయ్యాయి. మరోవైపు గంభీర్‌ సహాయక సిబ్బంది ఇంకా ఖరారు కాలేదు.

సపోర్ట్ స్టాఫ్‌ను ఎంపికపై బీసీసీఐ దృష్టిసారించింది. గంభీర్ సిఫార్సులను కొన్ని తిరస్కరిస్తూ, మరికొన్ని అంగీకరిస్తోంది. శ్రీలంక పర్యటన ప్రారంభానికి ముందుగానే సహాయక సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెల 26 నుంచి భారత జట్టు లంక పర్యటన మొదలుకానుంది. అయితే గంభీర్‌ను కోచ్‌గా ఎంపిక చేసే ముందు విరాట్ కోహ్లి అభిప్రాయాన్ని బీసీసీఐ తీసుకోకపోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తుంది.

BCCI Reportedly Planning to Remove Virat Kohli from the Indian Cricket Team

కోచ్‌గా గంభీర్ ఎంపిక విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను మాత్రమే బీసీసీఐ సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోహ్లిని ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని క్రమంగా జట్టు నుంచి పక్కనపెట్టే ప్రయత్నంలో బీసీసీఐ ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టెస్టు ఫార్మాట్‌లో కొనసాగుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కోహ్లిని వన్డే ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పించి, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-2025 ఫైనల్ అనంతరం యువకులతో టెస్టు జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

కాగా, శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్‌గా యాక్షన్‌లోకి దిగనున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతను కోచ్ పదవిలో ఉంటాడు. అప్పటివరకు భారత అయిదు ఐసీసీ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే 2025లోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంటుంది. 2026లో టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత 2027లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే మహా సమరం జరుగుతాయి.

Story first published: Friday, July 12, 2024, 8:23 [IST]
Other articles published on Jul 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+