క్రికెటర్లకు నాడా డోపింగ్ పరీక్షలు: ఆరు నెలలపాటు ట్రయల్


హైదరాబాద్: వాడా.. నాడా.. లాంటి డోపింగ్ వ్యతిరేక సంస్థలకు ఆమడ దూరంలో ఉండే బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంంది. ఇకపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)తో కలిసి పని చేసేందుకు సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. గతంలో వీటిని పూర్తిగా వ్యతిరేకించిన బీసీసీఐ.. జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా)తో కలిసి వచ్చే ఆరు నెలలు పనిచేసేందుకు అంగీకరించింది.
ఈ మేరకు బీసీసీఐ, ఐసీసీ, నాడా మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతానికి ఇది ఆరు నెలలు మాత్రమేనని... ఫలితాలతో తాము సంతృప్తి చెందితేనే కొనసాగిస్తామని, లేదంటే ఒప్పందాన్ని రద్దు చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌తో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, సీఓఏ సభ్యుల సమావేశం జరిగిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆరు నెలలపాటు ఒప్పందం
"ఐసీసీ, బీసీసీఐ, నాడా మధ్య ఆరు నెలలపాటు ఒప్పందం కుదిరింది. రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల శాంపిల్స్‌ను నాడా ద్వారా జాతీయ డోప్ టెస్టింగ్ లేబొరేటరీ (ఎన్‌డీటీఎల్)కి పంపించనున్నారు. మాకు సంతృప్తి కలగకపోతే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం" అని బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు తమ క్రికెటర్లకు స్వీడన్‌లోని ఐడీటీఎంలో బీసీసీఐ డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది.

బీసీసీఐని తమ పరిధిలోకి తీసుకురావాలని
బీసీసీఐని తమ పరిధిలోకి తీసుకురావాలని గతంలోనే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఐసీసీని హెచ్చరించిన సంగతి తెలిసిందే. "నిబంధనల ప్రకారం కనీసం పది శాతం శాంపుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షల కోసం మేం ముందుగా వాటిని అందజేస్తాం. ఇందులో భారత క్రికెటర్లతో పాటు దేశవాళీ ఆటగాళ్లు కూడా ఉంటారు" అని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

10 శాతం శాంపిల్స్
"వాడా నిబంధనల ప్రకారం 10 శాతం శాంపిల్స్ అందించాల్సి ఉంది. అందులో టాప్ క్రికెటర్లతోపాటు ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ల నమూనాలు కూడా ఉంటాయి" అని ఆ అధికారి చెప్పారు. అలాగే 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్తోపాటు భవిష్యత్తులో ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్‌కప్-2021, వన్డే వరల్డ్‌కప్-2023కు సంబంధించిన రూ. 150 కోట్ల పన్ను మినహాయింపుల విషయమై కూడా చర్చ జరిగినట్టు తెలిపారు.

ప్రభుత్వం ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోతే
ఒకవేళ ప్రభుత్వం ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోతే ఆ భారాన్ని ప్రసారదారులు, స్పాన్సర్లు కూడా కొంత మొత్తాన్ని భరించే విధంగా ఓ ప్రణాళికను మనోహర్ ముందుంచినట్టు చెప్పారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయరాదంటూ స్టార్ స్పోర్ట్స్‌కు బీసీసీఐ స్పష్టతనిచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications