For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : రంజీ ఆడాలని టీమిండియాకు దూరమైన స్టార్ ప్లేయర్!

BCCI releases star player befor INDvsAUS second Test

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో టీమిండియా కీలక నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టులో స్టార్ ప్లేయర్ ఆడటం లేదని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత జట్టు.. ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం సిద్ధం అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఆడటం లేదని సమాచారం. ఈ మ్యాచ్‌లో ఆడకుండా అతను రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు వెళ్తున్నాడట.

సౌరాష్ట్ర కెప్టెన్‌గా ఉన్న ఉనద్కత్.. ఇటీవల తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. బ్యాటింగ్‌లో కొంత తడబడిన అతను బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టాడు. అనంతరం ఆస్ట్రేలియా సిరీస్‌లో జట్టులో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్ కోసం జయదేవ్ ఉనద్కత్‌ను కూడా ఎంపిక చేశారు. కానీ తొలి టెస్టులో అతనికి ఆడే అవకాశం రాలేదు.

ఢిల్లీలో జరిగే రెండో టెస్టులో కూడా స్పిన్‌కు సహకరించే పిచ్‌నే తయారు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులో మూడో పేసర్ అవసరం భారత్‌కు లేదు. దానికితోడు ఉమేష్ యాదవ్ ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. అతను రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడేందుకు వెళ్తున్నట్లు తెలిపింది.

సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది. ఆ మరుసటి రోజున అంటే ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో రంజీ మ్యాచ్ ఆడేందుకు ఉనద్కత్ నిర్ణయించుకున్నాడు. దీంతో అతన్ని టీమిండియా నుంచి అతన్ని రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ కూడా ధ్రువీకరించింది.

Story first published: Sunday, February 12, 2023, 20:15 [IST]
Other articles published on Feb 12, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+