
టీమిండియా మెన్స్, వుమెన్స్ క్రికెట్ జట్ల జెర్సీలను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. అయితే ఈ జెర్సీ టీ20లకు మాత్రమే వర్తించనుంది. గత కొన్ని రోజులుగా జెర్సీ ప్రమోషన్ విషయంలో ఎంపీఎల్ బ్రాండ్ చాలా హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందు నుంచి ఇక నయా జెర్సీలో టీమిండియా కన్పించబోతుంది. ఇక ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ ఎంపీఎల్ స్పాన్సర్డ్ జెర్సీని విడుదల చేసింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు భారత జట్టు ఈ జెర్సీని ధరించబోతుంది. సెప్టెంబర్ 20న మొహాలీ వేదికగా తొలి టీ20తో ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సిరీస్ ప్రారంభం కానుంది.
ఇకపోతే కొత్త జెర్సీకి సంబంధించిన బీసీసీఐ విడుదల చేసిన పోస్టర్‌లో భారత మెన్స్, వుమెన్స్ టీం జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్‌కౌర్ ఉన్నారు. అలాగే మెన్స్ జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉండగా.. వుమెన్స్ టీం నుంచి షపాలీ వర్మ, రేణుకా సింగ్ ఉన్నారు. 2020లో ఎంపీఎల్-బీసీసీఐల మధ్య ఒప్పందం జరిగింది. అంతకుముందు నైక్ జెర్సీ స్పాన్సర్‌గా ఉండేది. ఎంపీఎల్ స్పాన్సర్‌గా ఇది మూడో జెర్సీ. ప్రస్తుతం ఉన్న జెర్సీ థిక్ బ్లూ రంగు కలిగి ఉండగా.. దీంతో పోలిస్తే కొత్త జెర్సీ కాస్త లైట్ బ్లూ రంగును కలిగి ఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్‌లో ఉండగా.. జెర్సీపై గీతలు వచ్చాయి.
ఆస్ట్రేలియాతో మూడో టీ20కి బరిలో దిగే భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్(షమీ రిప్లేస్ మెంట్) , హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా