బీసీసీఐ ప్రతిపాదన: అర్జున అవార్డుకు ధావన్, స్మృతి మందాన పేర్లు

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన పేర్లను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధావన్, మందాన పేర్లను అర్జున అవార్డు కోసం సిఫారసు చేస్తున్నట్లు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో శిఖర్ ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
మూడు ఫార్మాట్‌లలో ఆడే ధావన్ భారత్ క్రికెట్ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక, స్మృతి మందాన విషయానికి వస్తే మహిళల జట్టు ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తోంది. గతేడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన మహిళల వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడంలో మందాన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ ఉమెన్స్ ర్యాకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌లో ఐదు అర్ధ శతకాలతో 531 పరుగులు చేసి తనదైన ముద్ర వేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications