న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్జున అవార్డుకు నలుగురి క్రికెటర్ల పేర్లు సిఫారసు చేసిన బీసీసీఐ

BCCI Recommends Bumrah,Shami,Jadeja And Poonam Yadav For Arjuna Award || Oneindia Telugu
BCCI recommends Mohammad Shami, Jasprit Bumrah, Ravindra Jadeja and Poonam Yadav for Arjuna Award

హైదరాబాద్: 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకి బీసీసీఐ ప్రతిపాదనలు పంపింది. ఓ మహిళతో పాటు ముగ్గురు పురుష క్రికెటర్ల పేర్లను శనివారం సిఫారసు చేసింది. పురుషుల క్రికెటర్ల విభాగంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్లను ప్రతిపాదించగా.. మహిళా క్రికెటర్లలో లెగ్‌స్పిన్నర్ పూనమ్‌ యాదవ్‌ పేరుని అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నలుగురి క్రికెటర్ల పేర్లు సిఫారసు

నలుగురి క్రికెటర్ల పేర్లు సిఫారసు

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తోన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీతో న్యూఢిల్లీలో సమావేశమై క్రికెట్‌ జీఎం సాబా కరీమ్‌ ఈ నలుగురి క్రికెటర్ల పేర్లను సిఫార్సు చేశారు. ఈ ఏడాది మహిళల క్రికెటల్లో పూనమ్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసింది.

భారత విజయాల్లో పూనమ్ యాదవ్ కీలకపాత్ర

భారత విజయాల్లో పూనమ్ యాదవ్ కీలకపాత్ర

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేల్లో 4 వికెట్లు, టీ20ల్లో 2 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. భారత్ తరుపున మొత్తం 41 వన్డేలు, 54 టీ20 లాడిన పూనమ్ యాదవ్ వరుసగా 63, 74 వికెట్లు పడగొట్టింది. ఇక, షమీ, జడేజా, బుమ్రా విషయానికి వస్తే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు.

యార్కర్లతో భయపెడుతోన్న బుమ్రా

యార్కర్లతో భయపెడుతోన్న బుమ్రా

ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో కూడా ఈ ముగ్గరూ చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ బుమ్రా తన యార్కర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. వన్డేల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న బుమ్రా ఈ ఏడాది ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

ఆసీస్ పర్యటనలో చెలరేగిన షమీ

ఆసీస్ పర్యటనలో చెలరేగిన షమీ

ఆస్ట్రేలియా సిరిస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో బుమ్రా 21 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మరో బౌలర్‌ షమీ సైతం టీమిండియాలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతొ సొంతగడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో అద్భు ప్రదర్శన చేశాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లాడిన షమీ 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం జరుగుున్న పంజాబ్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడి 14 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, April 27, 2019, 15:07 [IST]
Other articles published on Apr 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X