Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత ఆటగాళ్లకు మరీ డిమాండ్ ఎక్కువ.. రిటైర్‌మెంట్‌పై బీసీసీఐ సీరియస్!

ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వీటిలో వస్తున్న లాభాలు చూసిన చాలా దేశాలు వీటిని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ లీగుల్లో భారత ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉంది. దీంతో వాళ్లు ఇక్కడ రిటైర్‌ అయిపోయి ఆ లీగుల్లో ఆడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత దేశవాళీ కుర్రాళ్లు సడెన్‌గా రిటైర్మెమట్ ప్రకించి ఇతర లీగ్స్ కోసం వెళ్లిపోయే ప్రమాదం ఉంది.

ఇలాంటి పరిస్థితిని అరికట్టేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా సరే ఈ లీగుల్లో పాల్గొనేందుక రిటైర్ అవ్వకుండా అడ్డుకోవాలని డిసైడ్ అయింది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లీగ్స్‌లో భారతీయ ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉందని చోప్రా చెప్పాడు. అందుకే ఆటగాళ్లు రిటైర‌మెంట్ తీసుకోకుండా బీసీసీఐ ఈ ప్లాన్ చేసిందన్నాడు.

BCCI

'రిటైర్ అయిన ప్లేయర్ల కోసం బీసీసీఐ కొత్త పాలసీ తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మొదలవుతున్న క్రికెట్ లీగుల్లో భారత ప్లేయర్లకు భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే వాళ్లు లేకపోతే లీగ్ బ్రాడ్‌కాస్టర్లు ఆయా లీగుల హక్కులకు కొనేందుకు మక్కువ చూపడం లేదు. దీంతో చాలా మంది రిటైర్‌మెంట్ ప్రకటించి, ఆయా లీగ్స్ ఆడేందుకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది' అని చోప్రా చెప్పాడు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్లనే ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కూడా మేజర్ లీగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

'ఆయా లీగుల్లో బ్రాడ్‌కాస్టర్లకు వచ్చే లాభాల్లో ఎక్కువ ఇండియా నుంచే. అబుదాబి, దుబాయ్, సౌతాఫ్రికా.. ఎక్కడ ఈ లీగులు జరిగినా ఎక్కవగా చూసేది మనవాళ్లే. సౌతాఫ్రికా లీగ్‌లో ఆ దేశ స్టార్ ప్లేయరలు ఉన్నారు. కానీ మిగతా లీగులు అన్నీ కూడా విదేశీ స్టార్లపై ఆధారపడి సాగుతున్నవే. ఇక యూఏఈలో జరిగిన ఐఎల్‌టీ20 అయితే పూర్తిగా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చింది' అని చోప్రా వివరించాడు.

BCCI

ఇన్ని అవకాశాలు లభిస్తుండటంతో చాలా మంది తమ ప్రిఫరెన్స్‌లు మార్చేసుకుంటారని, భారత్‌లో క్రికెట్ ఆడటం మానేసి అక్కడకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని చోప్రా అన్నాడు. భారత్‌లో సాధారణ ప్లేయర్లుగా ఉన్న చాలా మంది.. రిటైర్‌మెంట్ తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం కూడా కనిపిస్తోందన్నాడు. వీటిని ఆపేందుకు బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొస్తుందని చోప్రా అభిప్రాయపడ్డాడు.

'ఈ కారణంగా బీసీసీఐ ఈ రిటైర్‌మెంట్‌పై కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టే అవకాశం ఉంది. ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇది ఇప్పటికే ఉంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్లేయర్ మారితే.. ఒక ఏడాదిపాటు ఎక్కడి నుంచి క్రికెట్ ఆడటానికి ఉండదు' అని చోప్రా తెలిపాడు. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఇలాగే ఏడాదిపాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఈ నిర్ణయం వల్ల క్రికెటర్లు అంత త్వరగా రిటైర్‌మెంట్ తీసుకోరని చోప్రా అన్నాడు. రిటైర్‌మెంట్ తీసుకున్న ప్లేయర్లు ఒక ఏడాదిపాటు మరెక్కడా క్రికెట్ ఆడకూడదని బీసీసీఐ నిబంధన పెట్టాలని అనుకుంటోంది. దీనిపై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామని, వార్షిక సమావేశంలో దీనిపై ఆమోద ముద్ర వేస్తారని బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి.

Story first published: Sunday, July 9, 2023, 16:13 [IST]
Other articles published on Jul 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+