రోడ్‌మ్యాప్ సిద్ధం: ఎన్‌సీఏ సమస్యలపై చర్చించనున్న గంగూలీ, ద్రవిడ్

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు సౌవర్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్ రాహుల్ ద్రవిడ్‌ని బుధవారం బెంగళూరులో కలవనున్నారు. ఈ సమావేశంలో భారత క్రికెట్‌ను ఎలా దారిలో పెట్టాలనే రోడ్ మ్యాప్‌పై చర్చించనున్నారు. ఈ ఏడాది జులైలో ఎన్‌సిఎ హెడ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ ఓ రోడ్‌మ్యాప్‌ను రూపొందించాడని... ఇద్దరు మాజీ కెప్టెన్లు కలిసినప్పుడు గంగూలీ తన అభిప్రాయాలను కూడా రాహుల్ ద్రవిడ్‌తో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అక్టోబర్ 30న బాధ్యతలు స్వీకరించిన కొత్తగా ఎన్నికైన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు కూడా పాల్గొంటారు.

ఎన్‌సీఏ సీఈఓ తుఫాన్ ఘోష్ కూడా
జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) సీఈఓ తుఫాన్ ఘోష్ కూడా చర్చల్లో పాల్గొంటాడు. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు గతంలో కొన్ని బీసీసీఐ సాంకేతిక కమిటీ సమావేశాలలో కలిసి పాల్గొన్నారు. ఈ సాంకేతిక కమిటీకి సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమావేశాలకు ద్రవిడ్ ఇండియా అండర్-19, ఏ జట్టు హెడ్ కోచ్‌గా హాజరయ్యారు.

పునరావాస కేంద్రంగా ఎన్‌సీఏ
గత కొన్ని సంవత్సరాలుగా భారత క్రికెట్‌కు జాతీయ క్రికెట్ అకాడమీ వాస్తవానికి పునరావాస కేంద్రంగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే విషయాన్ని తన తొలి సమావేశంలో ప్రస్తావించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త ప్రాజెక్టుపై సౌరవ్ గంగూలీ బుధవారం ద్రవిడ్‌ను కలవనున్నారు.

సమస్యలపై చర్చించనున్న ద్రవిడ్, గంగూలీ
"గంగూలీ, ద్రవిడ్ జాతీయ క్రికెట్ ఆకాడమీ(ఎన్‌సీఏ) కోసం ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై.. అది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తారు" అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు రోజుల క్రితం గంగూలీని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) ఘనంగా సన్మానించిన సంగతి తెలిసిందే.

వీవీఎస్ లక్ష్మణ్ సైతం
ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "భారత్ ఇంతలా రాణించేందుకు ప్రధాన కారణం రిజర్వ్ బెంచే. ఈ నేపథ్యంలో గంగూలీ ఇప్పుడు ఎన్‌సీఏకు మరింత ప్రాధాన్యమిస్తాడని ఆశిస్తున్నా. NCA ద్వారా, చాలా కాలం పాటు భవిష్యత్ ఛాంపియన్లను ఉత్పత్తి చేయవచ్చు. ఎప్పుడైతే రొటేషన్ అవసరమో వారితో ఆ స్థానాలను భర్తీ చేయొచ్చు" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications