ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యం.. అందుకే ఐపీఎల్ వాయిదా: గంగూలీ

ముంబై: ప్రజా సంక్షేమమే తొలి ప్రాధాన్యమని, అందుకే ఏప్రిల్ 15కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండటంతో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఐపీఎల్ 13వ సీజన్‌ను శుక్రవారం వాయిదా వేసిన విషయం తెలిసిందే. విదేశీ ఆటగాళ్లకు అనుమతి నిరాకరణ, ఖాళీ కుర్చీల మధ్య మ్యాచ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యతిరేకత కారణంగా బీసీసీఐ చివరకు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

భద్రతే ముఖ్యం
ఐపీఎల్ వాయిదా వేశాక సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడారు. 'ప్రస్తుతానికి ఐపీఎల్ వాయిదా వరకే ఆలోచిద్దాం. భద్రతే అందరికీ తొలి ప్రాధాన్యం. అందుకే ఐపీఎల్ మ్యాచులను వాయిదా వేశాం. ఆ తర్వాత ఏం జరగనుందో చూద్దాం. పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలసు. ఇప్పుడే కరొనపై సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుంది' అని అన్నారు.

ఎవరి చేతుల్లో ఏం లేదుగా:
ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ మొదలైతే డబుల్ హెడర్స్ (రోజుకు రెండు మ్యాచులు) ఎక్కువ అవుతాయని ప్రశ్నించగా.. ఇప్పుడే దాని గురించి ఏమీ చెప్పలేం అని దాదా సమాధానం ఇచ్చారు. ఐపీఎల్ వాయిదా వేసినందుకు ఫ్రాంచైజీలు సంతోషంగా ఉన్నాయా అని అడగ్గా.. 'ఎవరి చేతుల్లో ఏం లేదుగా' అని గంగూలీ చెప్పారు. ఏ విషయమైనా ఏప్రిల్ 15 తర్వాతే చెపుతాం అని దాదా స్పష్టం చేసారు.

వన్డే సిరీస్ రద్దు:
కరోనా వైరస్ ముప్పుతో ప్రస్తుతం జరుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌నూ బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ.. కరోనా పంజా విసురుతుండంతో చివరికి రద్దు వైపే బీసీసీఐ మొగ్గు చూపింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ధర్మశాలలో తొలి వన్డే జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్ రద్దైంది. 15న లక్నోలో రెండో వన్డే, 18న కోల్‌కతాలో జరగాల్సిన చివరి వన్డే రద్దు అయ్యాయి.

భారత్‌లో నో క్రికెట్ మ్యాచ్‌లు:
చైనాలో పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. భారత దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇప్పటికే 80కి పైగా చేరింది. దీంతో అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేయడంతో ఐపీఎల్, వన్డే సిరీస్ వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా అభిమానులు మరికొన్ని రోజులు భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కోల్పోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications