ఇప్పుడు ఎంతో ఖాళీగా ఉన్నా.. గతంలో ఇలా ఎప్పుడున్నానో కూడా గుర్తులేదు: గంగూలీ

కోల్‌కతా: మహమ్మారి కరోనా (కొవిడ్-19) వైరస్ ముప్పుతో క్రీడా రంగంకు అనుకోని విరామం ఏర్పడింది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు. అన్ని బోర్డులు మ్యాచులు, సిరీసులను వాయిదా వేశాయి. పరిస్థితులను సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించాయి. భారత్‌లో కరోనా రెండో దశలో ఉండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు ఆదేశాలు జారీ చేసింది. జనాలు గుంపులుగా ఉండకుండా చూడాలని స్పష్టం చేసింది. దీంతో ఐపీఎల్ 2020ని ఏప్రిల్ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. అలానే బీసీసీఐ ఆఫీస్ కూడా క్లోజ్ చేసింది.

అనుకోని విరామం
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో దక్షిణాఫ్రికా-భారత్ సిరీస్ రద్దు కాగా.. ఐపీఎల్ వాయిదా పడడంతో భారత క్రికెటర్లు విరామాన్ని వారి కుటుంబంతో, సోషల్ మీడియాలో ఆస్వాదిస్తున్నారు. లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలు నెట్టింట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇపుడు ఈ జాబితాలో బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. కరోనా ప్రభావంతో ఇంటికి పరిమితమయ్యానని, ఇలా ఖాళీగా ఇంట్లో ఎప్పుడున్నానో కూడా గుర్తు లేదని గంగూలీ తెలిపాడు.
ఎంతో ఖాళీగా ఉన్నా
'ప్రమాదకర కరోనా వైరస్ భయంతో ఇంటికే పరిమితమయ్యా. చాలా రోజుల తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్న. సాయంత్రం 5 గంటలకు ఇలా ఇంట్లో కూర్చోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో ఖాళీగా ఉన్నా. ఇలా చివరిసారిగా ఎప్పుడున్నానో కూడా గుర్తులేదు' అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గంగూలీ రాసుకొచ్చాడు. క్రికెట్, క్యాబ్ అధ్యక్షుడిగా దాదా ఎంతో సేవ చేసాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక సమయమే దాదాకు దొరట్లేదు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు.

బైక్‌పై ధోనీ
ఐపీఎల్ రద్దవడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెన్నై నుంచి తన స్వస్థలం రాంచీకి వెళ్లిపోయాడు. అక్కడ బాడ్మింటన్ ఆడుతూ, బైక్‌లపై తిరుగుతున్నాడు. దాంతో జనాలు అతడి వద్ద గుమిగూడుతున్నారు. అంతకు ముందు ఓ అభిమానితో కరచాలనం సైతం చేశాడు. వీటికి సంబందించిన పోటీలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.
శునకంతో రాహుల్
కేఎల్ రాహుల్ తనకిష్టమైన శునకంతో కలిసి తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. యుజువేంద్ర చాహల్ టీమిండియా సహాయ సిబ్బందితో కలిసి దిగిన చిత్రాన్ని పోస్ట్ చేసి క్యాప్షన్ ఇవ్వాలని కోరాడు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఒక్క చోట కలిసిన వీడియో, ఫొటోలు పెట్టారు. ఇలా ఒక్కో క్రికెటర్ ఒక్కోలా ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications