Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసుప‌త్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్‌.. హోంఐసోలేష‌న్‌లోకి దాదా

BCCI President Sourav Ganguly discharged from hospital

బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 28న గంగూలీ క‌రోనా బారిన ప‌డ‌డంతో ఆయ‌న‌ను కోల్‌క‌తాలోని వుడ్‌లాడ్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. ఆ స‌మ‌యంలో 49 ఏళ్ల‌ గంగూలీకి తేలిక‌పాటి క‌రోనా ల‌క్ష‌ణాలు కూడా అన్నాడు. అయితే తాజాగా ఆసుపత్రిలో నిర్వ‌హించిన ఒమిక్రాన్ ప‌రీక్ష‌ల్లో దాదాకు నెగెటివ్‌గా తేలింది. ఒమిక్రాన్ వైర‌స్ లేద‌ని ప‌రీక్ష‌ల్లో నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న‌ను వైద్యులు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన‌ప్ప‌టికీ క‌రోనా నిబంధ‌న‌లు ప్ర‌కారం గంగూలీ ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నారు. 14 రోజుల ఈ హోంఐసోలేష‌న్‌లో గంగూలీని వైద్యులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షించ‌నున్నారు.

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రెసిడెంట్ గంగూలీ ఆసుప‌త్రిలో చేర‌డం 2021లో ఇది మూడోసారి. 2021 జ‌న‌వ‌రి ఆరంభంలో వ్యాయామం చేస్తుండ‌గా ఛాతీలో నొప్పి రావ‌డంతో ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. గంగూలీ గుండెలోని కుడి కరోనరీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. కోలుకున్న అనంత‌రం ఇంటికి వ‌చ్చారు. ఆ త‌ర్వాత 20 రోజుల త‌ర్వాత మ‌ళ్లీ గంగూలీ ఛాతిలో నొప్పి వ‌చ్చింది. దీంతో జనవరి 28న గంగూలీకి మ‌రోసారి యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు. గంగూలీ గుండెలోని రెండు ధమనులలో రెండు స్టెంట్‌లు ప‌డ్డాయి. ఇటీవ‌ల క‌రోనాతో ఆసుప‌త్రిలో చేర‌డంతో 2021లో దాదా మొత్తం మూడు సార్లు ఆసుప‌త్రిలో చేరిన‌ట్ట‌యింది. గ‌తంలో గంగూలీ సోద‌రుడు స్నేహాశిష్ కూడా క‌రోనా బారిన ప‌డ్డాడు.

Sourav Ganguly Tests Positive For Covid-19 Again | Oneindia Telugu

ప్ర‌స్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. టీమిండియా త‌రఫున 113 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 42 స‌గ‌టుతో 7,212 ప‌రుగుటు చేశాడు. ఇందులో 16 సెంచ‌రీలు, 35 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 239. ఇక 311 వ‌న్డే మ్యాచ్‌ల్లో 41 సగ‌టుతో 11,363 ప‌రుగులు చేశాడు. 22 సెంచ‌రీలు, 72 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 183. ఐపీఎల్‌లో కూడా 59 మ్యాచ్‌లు ఆడాడు. 25 స‌గ‌టుతో 1349 ప‌రుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్‌: 91.

Story first published: Friday, December 31, 2021, 15:50 [IST]
Other articles published on Dec 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+