Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు రోజుల టెస్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దు: దాదాను కోరిన ఐసీఏ

ICA Request To Sourav Ganguly About 4 Day Test Match ! || Oneindia Telugu
BCCI players’ body, FICA say no to 4-day Tests

హైదరాబాద్: ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఇండియన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఐసీఏ) సైతం ఐసీసీ ప్రతిపాదనపై స్పందించింది. ఐసీఏ బాడీ సభ్యులు ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కోరారు.

ఈ నేపథ్యంలో ఐసీఏ ప్రెసిడెంట్‌ అశోక్‌ మల్హాత్రా మాట్లాడుతూ "గంగూలీ.. నాలుగు రోజుల టెస్టు ఫార్మాట్‌కు ఒప్పుకోవద్దు. మేము ఐదవ రోజున మరిన్ని ఫలితాలను పొందడం ప్రారంభించాము. ఇప్పుడు, పింక్-బాల్ క్రికెట్ కూడా ఉంది. పింక్‌ బాల్‌ టెస్టును నిర్వహించి కూడా సక్సెస్‌ అయ్యాం. కాబట్టి మీరు తీవ్రమైన మార్పు ఎందుకు చేయాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించారు.

"ఆపై వెంటనే ఇంత మార్పు ఏమిటి? మీరు ఎక్కువ టి 20 క్రికెట్‌కు అనుగుణంగా షెడ్యూల్ విండోను తెరవడానికి ప్రయత్నిస్తున్నారా? వరుసగా మార్పులు చేసుకుంటూ పోతే మంచిది కాదు. మనం ఏమైనా షెడ్యూలింగ్‌ విండో కోసం ప్రయత్నిస్తున్నామా?. మనకి సాధ్యమైనంత వరకూ ఎక్కువ టీ20 క్రికెట్‌ను నిర్వహిద్దాం. అంతే కానీ నాలుగు రోజుల టెస్టు వద్దు" అని గంగూలీకి అశోక్‌ మల్హాత్రా విజ్ఞప్తి చేశారు.

ఒకవేళ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి సానుకూల స్పందన వస్తే అందుకు ఐసీసీ కూడా మరో అడుగు ముందుకేసే అవకాశం ఉంది. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ల నిర్వహించాలన్నఐసీసీ ఆలోచనను మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఏ నిర్ణయం తీసుకుంటాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Story first published: Thursday, January 9, 2020, 17:59 [IST]
Other articles published on Jan 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+