దుబాయ్‌లో మినీ ఐపీఎల్: బీసీసీఐ ప్లాన్ చేస్తోందా?
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టోర్నీ. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ని తిరుగులేని శక్తిగా ఐపీఎల్ నిలిపిందనడంలో ఎటువంటి సందేహాం లేదు. ఇండియాలో నిర్వహించే ఈ టోర్నీని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలోనే అభిమానులు వస్తున్నారు.
ఐపీఎల్‌కి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మినీ ఐపీఎల్ రూపంలో టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లతోనే దుబాయ్ వేదికగా ఒక మినీ టోర్నీ నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
ఐపీఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉందని, అలాంటి ఐపీఎల్‌ను ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహించడం సబబుకాదని ఆయన అన్నారు. దీంతో మినీ ఐపీఎల్ నిర్వహించాలన్న దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. చర్చలు ఫలిస్తే మినీ ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తామని అన్నారు.

విదేశాల్లో మినీ ఐపీఎల్‌పై రాజీవ్ శుక్లా
‘విదేశాల్లో మినీ ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని గత కొంతకాలంగా బీసీసీఐలో చర్చిస్తున్నాం. ఐపీఎల్‌కి ఆదరణ ఎలా పెరుగుతుందో గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ఛాంపియన్ లీగ్ టీ20 ఆలోచన ఫెయిల్ అయ్యింది. అందుకే దాని స్థానంలో మినీ ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నాం. ఈ టోర్నీకి దుబాయ్ మంచి వేదికని మా భావన' అని రాజీవ్ శుక్లా వివరించారు.

ఐపీఎల్ 11వ సీజన్‌లో చాలా మార్పులు
వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 11వ సీజన్‌లో చాలా మార్పులు ఉంటాయని, అభిమానులను ఈ టోర్నీ ఎంతగానో అలరిస్తుందని ఆయన అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఐపీఎల్ మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శుక్లా తెలిపారు.

వెన్యూ పంపిణీ విధానంలోనూ మార్పులు
దీని కోసం బీసీసీఐ రెవెన్యూ పంపిణీ విధానంలోనూ మార్పులు చేయాలనుకుంటున్నామని, ఫ్రాంచైజీ జట్టు బీసీసీఐతో రెవెన్యూ పంచుకునే విధానం గురించి ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో 8 జట్లే ఆడతాయని, 10 జట్లు పాల్గొంటే టోర్నీ సుదీర్ఘంగా మారిపోతుందని ఆయన వివరించారు.

యువ క్రికెటర్లకు ఎంతో లాభం
ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్‌లో పాల్గొన్న ఎంతో మంది ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటారని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్లకు ఎంతో లాభించిందని, ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్ధాయి ఆటగాళ్లతో భారత్‌కు చెందిన యువ క్రికెటర్లు కలిసి ఆడటం వల్ల వారికి ఎంతగానో లాభిస్తుందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications