ముంబై: నవంబర్ 9 నుంచి ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరిస్ కోసం భారత జట్టుని బీసీసీఐ బుధవారం (నవంబర్ 2)న ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్ కోసం టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ బుధవారం నాడు ఇంగ్లాండ్ సిరిస్ కోసం టెస్టు జట్టుని ఎంపిక చేసే అవకాశం ఉందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను భారత్ 3-0తేడాతో వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం పాలవ్వగా అతడి స్ధానంలో వెటరన్ ఓపెనర్ గంభీర్ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇషాంత్ శర్మ స్ధానంలో ఆఫ్ బ్రేక్ బౌలర్ జయంత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గంభీర్ బ్యాటింగ్ చేయకపోయినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న రంజీల్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు, మూడు టెస్టులకు దూరమయ్యాడు.
ధావన్ స్ధానంలో కరుణ్ నాయర్‌కు జట్టులోకి తీసుకున్నప్పటికీ, టెస్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్ కోసం చోటు దక్కించుకునేందుకు గంభీర్, కేఎల్ రాహుల్ తో పాటు శిఖర్ ధావన్ లాంటి ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఓడిషాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో గంభీర్ 147 పరుగులతో సెంచరీని సాధించి టెస్టు జట్టులో తన స్ధానంపై సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చికెన్ గున్యా నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ కూడా చక్కని లైన్ అండ్ లెంత్ బౌలింగ్‌తో రాణించాడు. రెండు రంజీ మ్యాచ్‌లాడిన ఇషాంత్ 40 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు.
ఫిట్ నెస్ కోలుకున్న తర్వాత భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్‌లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో వీరిద్దరికి చోటు దక్కడం అనుమానంగానే ఉంది. ఇదిలా ఉంటే భారత పర్యటనకు బంగ్లాదేశ్ నుంచి ఇంగ్లాండ్ జట్టు బుధవారం రానుంది.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 9 నుంచి టెస్ట్ సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్‌కి రాజ్ కోట్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే సిరిస్ జనవరి 15, 2017న ప్రారంభం కానుంది. పూణెలో తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. జనవరి 26 నుంచి ట్వంటీ20 సిరిస్ కాన్పూర్‌లో ప్రారంభం కానుంది.
India-England series schedule:
Test matches to start at 9.30 AM IST
1st Test - November 9-13 (Wednesday to Sunday) - Rajkot
2nd Test - November 17-21 (Thursday to Monday) - Visakhapatnam
3rd Test - November 26-30 (Saturday to Wednesday) - Mohali
4th Test - December 8-12 (Thursday to Monday) - Mumbai
5th Test - December 16-20 (Friday to Tuesday) - Chennai