గుండెకు హత్తుకునేలా: ట్రిబ్యుట్ టు కెప్టెన్ ధోని (వీడియో)
హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అందరి మన్ననలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని వన్డే, టీ20ల్లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి బుధవారం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ మేరకు ధోని సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోని వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా అందుబాటులో ఉంటాడు. అయితే ధోని తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆటగాడిగా ధోని స్ధానానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే ఎంత ఫిట్‌గా ఉన్నా కొత్త కుర్రాళ్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోవాలంటే ధోని అద్భుతాలు చేయాల్సిందే. ఈ ఏడాది జులైలో చాంపియన్స్ ట్రోఫీ ముగిసే సమయానికి ధోనికి 36 ఏళ్లు నిండుతాయి.
దీనిని బట్టి చూస్తుంటే ధోని తన బ్యాట్‌తో ఇంకొంత కాలం మాత్రమే అభిమానులు అలరించనున్నాడు. కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో మూడు ఫార్మెట్లకు కెప్టెన్‌గా కోహ్లీనే బీసీసీఐ నియమించనుంది. కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడాన్ని పలువురు మాజీలు సైతం స్వాగతించారు.
మూడు ఫార్మెట్లలో కూడా భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను ధోని అందించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా భారత క్రికెట్ చరిత్రలో ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 వరల్డ్ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.
కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించిన ధోని ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ ట్విట్టర్‌లో గుండెకు హత్తుకునే వీడియోని పోస్టు చేసింది. ఈ వీడియోలో ధోని సాధించిన విజయాలను పొందుపరిచింది.
VIDEO: A tribute to @msdhoni the #Captain...A look at some of the glorious moments under his captaincy https://t.co/o6Vb0oxSEt #Dhoni
— BCCI (@BCCI) 5 January 2017
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications