Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లేకు బిసిసిఐ భారీగానే చెల్లిస్తోంది: కానీ, శాస్త్రి కంటే తక్కువే!

బెంగళూరు: టీమిండియా కొత్త కోచ్ అనిల్ కుంబ్లేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) భారీ మొత్తమే పారితోషికంగా చెల్లిస్తోంది. అయితే, ఇంతకుముందు టీమ్ డైరెక్టర్‌గా పని చేసిన రవిశాస్త్రికి చెల్లించినదానికంటే కూడా ఇది తక్కువే కావడం గమనార్హం.

అయితే, గతంలో పని చేసిన కోచ్‌లు గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్‌ల కంటూ కూడా ఇది చాలా ఎక్కువే. ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. కుంబ్లే తన జీతంగా ఏడాదికి రూ. 6.25 కోట్లు పొందనున్నారు. ఇది రవిశాస్త్రి పొందిన దానికంటే 75లక్షలు తక్కువ.

BCCI to pay Rs 6.25 crore salary to India coach Anil Kumble

కాగా, ఈ గతంలో టీమిండియాకు కోచ్‌లు పని చేసిన గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్‌లకు రూ. 3 నుంచి 4కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది. ఏడాది కాంట్రాక్ట్‌పై అనిల్ కుంబ్లే గత జూన్‌లో నియామకం అయిన విషయం తెలిసిందే.

కుంబ్లే నేతృత్వంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. కాగా, ఆగస్టు 27, 28 తేదీల్లో రెండు టీ20లను వెస్టిండీస్ జట్టుతో టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌లు తొలిసారి అమెరికాలో జరుగనున్నాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+