
హైదరాబాద్: ఐపీఎల్ వల్ల వచ్చే ఆదాయాన్ని బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ఖాతాలో వేసుకోవడమే కాదు, అంతే స్థాయిలో పన్ను చెల్లిస్తుంది. ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలి ఐపీఎల్ సీజన్ 2007-2008 ఆర్థిక సంవత్సరం నుంచి ఐపీఎల్ 2017వరకు జరిగిన పది సీజన్లకు రూ. 3500 కోట్ల రూపాయలను కట్టిందట.
ఐపీఎల్ గురించి ప్రత్యేక సమాచారం..
ఇంత పన్ను కట్టలేమంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు బీసీసీఐ అభ్యర్థన చేసింది. ఇప్పటి వరకు కేవలం ఐపీఎల్‌ల మీద రూ. 12000 కోట్ల రూపాయల ఆదాయం సొంతం చేసుకున్న బీసీసీఐకి ఏ మాత్రం తగ్గింపు ఇవ్వబోమని ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ తెగేసి చెప్పింది.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పదేళ్ల ముందు వరకు బీసీసీఐని ఓ సేవా సంస్థ కింద పరిగణించి పన్ను సడలింపు ఇచ్చింది. కానీ, ఐపీఎల్ మొదలైన తర్వాత నుంచి ఐటీ శాఖ కమర్షియల్ సంస్థ అంటూ పేర్కొని పన్ను వసూలు చేయడం మొదలుపెట్టింది. సంవత్సరానికి రూ. 350 కోట్లు చొప్పున దాదాపు రూ. 3500కోట్లు చెల్లించినట్టు ఓ వార్తా ప్రతిక పేర్కొంది.
ఇదే విషయమై బీసీసీఐ ముంబై హైకోర్టులో 30శాతం పన్ను సడలింపు కావాలని దరఖాస్తు చేసింది. క్రికెట్ అభివృద్ధి పెరుగుదల కోసం ఖర్చు చేయాల్సి ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. తత్ఫలితంగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.100 కోట్ల పన్ను మాత్రమే కట్టి తప్పించుకుంది. ఆ ఏడాది మినహాయించి అన్ని సంవత్సరాలు ఒకేలా పన్ను కడుతున్నట్లు సమాచారం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.