షెడ్యూల్ ప్రకారమే శ్రీలంక పర్యటన.. స్పష్టం చేసిన బీసీసీఐ!!

ముంబై: అన్ని కుదిరితే షెడ్యూల్ ప్రకారమే శ్రీలంక పర్యటన ఉంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ దుమాల్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ద్వైపాక్షిక సిరీస్ కోసం తమ దేశంలో పర్యటించాల్సిందిగా బీసీసీఐని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) శుక్రవారం కోరింది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల నిర్వహణపై అనిశ్చితి నెలకొనడంతో.. లంకకు వచ్చే అవకాశాల్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐకి ఈ-మెయిల్ ద్వారా ఎస్‌ఎల్‌సీ తెలిపింది.

బీసీసీఐకి ఎస్‌ఎల్‌సీ వినతి:
జూన్-జూలై మధ్య శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా ఈ పర్యటన వాయిదాపడనుందని వార్తలు వచ్చాయి. దీంతో పర్యటన విషయంలో క్లారిటీ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు స్వయంగా బీసీసీఐకి లేఖ రాసింది. కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తామని లంక అధికారులు పేర్కొనట్లు ఓ స్థానిక మీడియా పేర్కొంది.

ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంది:
లంక క్రికెట్ బోర్డు రాసిన లేఖపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పందించారు. హిందూస్తాన్ టైమ్స్‌తో దుమాల్ మాట్లాడుతూ... 'శ్రీలంక పర్యటనకు మేము సిద్దమే. అయితే ఆ పర్యటన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేత లేదా విదేశీ ప్రయాణ ఆంక్షలలో సడలింపు ఇస్తే.. షెడ్యూల్ ప్రకారమే శ్రీలంక పర్యటన ఉంటుంది. ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం కూడా బీసీసీఐకి ముఖ్యమే' అని అన్నారు.

శ్రీలంకలో కేసులు 935 మాత్రమే:
కరోనా నేపథ్యంలో భారత క్రికెట్ ఆటగాళ్లు ప్రస్తుతం తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. క్రికెటర్లకు కనీసం ఓ నెల రోజులైనా ప్రాక్టీస్ ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మరోవైపు ఫామ్ అందుకోవడానికి కనీసం నెల రోజులైనా పడుతుందని క్రికెటర్లు కూడా అంటున్నారు. అయితే శ్రీలంక మాత్రం ఈ సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ టూర్‌ను రద్దు చేసుకోవద్దని చూస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ఈ నెల 17న ముగియనున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 85 వేలకి చేరుకోగా.. శ్రీలంకలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు కేవలం 935 మాత్రమే.

ఐపీఎల్ 2020కి ఆతిథ్యమిచ్చేందుకు రెడీ:
ఇటీవలే ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా ఆతిథ్యమిచ్చేందుకు రెడీ అని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే లంక ప్రతిపాదనపై బీసీసీఐ మాత్రం మౌనంగా ఉండిపోయింది. ప్రస్తుత పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంది. ఇక భారత్ జట్టు శ్రీలంక పర్యటనకి వెళ్లినా.. అక్కడి ప్రభుత్వం నిబంధనలకి అనుగుణంగా కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications