Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

20న మరోసారి అంబుడ్స్‌మన్ ముందుకు సచిన్, లక్ష్మణ్

BCCI Ombudsman: Sachin Tendulkar, VVS Laxman Hearing To Continue On May 20

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశానికి సంబంధించి భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఈనెల 20న బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ ముందు మరోసారి హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు మేరకు మంగళవారం ఢిల్లీలో డీకే జైన్ ముందు సచిన్, లక్ష్మణ్ హాజరై తమ వాదనలు వినిపించారు. మరోవైపు సంజీవ్‌ గుప్తా కూడా విడిగా డీకే జైన్‌ను కలిసి వివరణ ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఎలా పొందుతున్నారో రాత పూర్వక వివరించాలంటూ ఆ ముగ్గురిని జైన్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచిన్, లక్ష్మణ్ మూడు గంటలకు పైగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ)లో కొనసాగుతూ.. ముంబై, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ఈ మాజీ క్రికెటర్లు మెంటార్‌గా వ్యవహరించడంపై తమ వాదనలను జైన్‌కు క్లుప్తంగా వివరించారు.

ముంబై, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు స్వచ్చందంగా పనిచేస్తున్నట్లు ఈ ఇద్దరూ చెబుతున్నారు. ఈ అంశంపై సచిన్, లక్ష్మణ్‌ మే 20న మరోసారి అంబుడ్స్‌మన్‌ను కలవనున్నారు. అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుత్నునట్లు తేలితే.. సీఏసీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమని లక్ష్మణ్ అన్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి ఆ రోజు ఏం జరుగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సభ్యులుగా ఉన్న సచిన్‌, లక్ష్మణ్‌.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లకు మెంటార్లుగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీ కూడా ఇరుకున్న విషయం తెసిందే.

Story first published: Wednesday, May 15, 2019, 9:54 [IST]
Other articles published on May 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+