న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని కోసమే వన్డే, టెస్ట్ సెలెక్షన్ మళ్లీ వాయిదా!

BCCI Official Says India Squads For New Zealand ODIs, Tests To Be Named After Hardik Pandyas Fitness Update

ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ అనంతరం టీమిండియా న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లనుంది. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో కోహ్లీసేన 5 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్ట్‌లు ఆడనుంది. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆదివారం వన్డే, టెస్ట్ టీమ్స్‌ను ఎంపికచేయాల్సి ఉంది. కానీ ఈ సెలెక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.

'జట్టు ఎంపిక గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. కానీ హార్ధిక్ పాండ్యా ఫిట్‌నెస్‌తో ఉండటం టీమ్‌కు అవసరం . కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అతను ఆటోమేటిక్‌గా జట్టులోకి వస్తాడు. అందుకే సెలెక్టర్లు మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారని'ఆ అధికారి చెప్పుకొచ్చారు.

రెండోసారి..

రెండోసారి..

వాస్తవానికి టీ20 టీమ్స్ ప్రకటించినప్పుడే వన్డే, టెస్ట్‌లను కూడా ఎంపికచేయాల్సి ఉండగా.. హార్దిక్ పాండ్యా కోసమే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వాయిదా వేసింది. తొలుత పాండ్యాను భారత్-ఎ టీమ్‌కు ఎంపికచేసినప్పటికి బౌలింగ్ వర్క్‌లోడ్ టెస్ట్‌లో విఫలమవడంతో అతన్ని తప్పించి విజయ్‌ శంకర్‌ను పంపింది. ప్రస్తుతం పాండ్యా టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

అందుకే వెయిటింగ్..

అందుకే వెయిటింగ్..

టీ20 వరల్డ్‌కప్ ప్లానింగ్స్‌లో భాగంగా పాండ్యా జట్టులోకి రావాలని టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. అందుకే కివీస్ పర్యటనలో అతని కోసం ఎదురుచూస్తోంది. ఇక బ్యాక్ సర్జరీ నుంచి కోలుకున్న పాండ్యా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఇప్పటికే టీ20లకు దూరమయ్యాడు. ఫిట్‌నెస్ నిరూపించుకుంటే వన్డే టీమ్‌లో హార్ధిక్‌కు ప్లేస్ గ్యారంటీ.

మళ్లీ ఫెయిలైతే..

మళ్లీ ఫెయిలైతే..

ఒకవేళ అతను ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే మాత్రం.. పవర్ హిట్టర్, ముంబై క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, కేదార్ జాదవ్‌ కన్నా టెక్నికల్‌గా మెరుగైన ఆటగాడైన అజింక్యా రహానేను కూడా కివీస్‌కు తీసుకెళ్లాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ఇక, లిమిటెడ్ ఓవర్లలో కీపింగ్, బ్యాటింగ్‌లో అదరగొడుతున్న కేఎల్ రాహుల్‌కు టెస్ట్ టీమ్‌లో చోటుదక్కే అవకాశం ఉంది. అదనపు పేసర్ కావాలనుకుంటే మాత్రం రైజింగ్ పేసర్ నవ్‌దీప్ సైనీ టెస్ట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

Story first published: Sunday, January 19, 2020, 14:58 [IST]
Other articles published on Jan 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X