బీసీసీఐ నుంచి ఊహించని స్పందన: 2014 పర్యాటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంపై బ్రావో


హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం భారత్ పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు సిరీస్‌ను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. భారత్‌తో నాలుగు వన్డేల జరిగిన తర్వాత ఐదో వన్డే ఆడే క్రమంలో ఆ జట్టు పర్యటనకు స్వస్తి పలికింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఆ దేశ క్రికెటర్లకు కాంట్రాక్ట్ విషయంలో విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన అర్ధాంతరంగా ముగిసింది.
అయితే ఆనాడు చోటు చేసుకున్న పరిస్థితులను తాజాగా ఆ దేశ్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తమ క్రికెట్ బోర్డుతో నెలకొన్న విభేదాల కారణంగా తాము పెద్ద మొత్తంలో నగదును కోల్పోయి పరిస్థితే వస్తే, అందుకు బీసీసీఐ నుంచి ఊహించని మద్దతు లభించిందని చెప్పుకొచ్చాడు.

మా బోర్డుతో విభేదాలు తారాస్థాయికి
"మేము భారత్ పర్యటనకు వచ్చేటప్పటికే మా బోర్డుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో భారత్‌లో మేము అడుగుపెట్టిన తర్వాత.. మా కాంట్రాక్ట్‌లపై విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో మేము వన్డే సిరీస్ ఆరంభానికి ముందే.. స్వదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. అసలు ఐదు వన్డేల సిరీస్ జరుగుతుందా అనేది కూడా అనుమానమే" అని అన్నారు.

ఎవరూ మ్యాచ్‌లు ఆడటానికి సుముఖంగా లేరు
"మా ఆటగాళ్లు ఎవరూ మ్యాచ్‌లు ఆడటానికి సుముఖంగా లేరు. ఈ విషయం అప్పటి బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ వరకూ వెళ్లింది. ఆ క్రమంలోనే నన‍్ను పిలిచి మాట్లాడారు. తొలి వన్డే జరగాల్సిన రోజు ఉదయం 3 గంటలకి బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ నుంచి ‘‘దయచేసి మ్యాచ్‌లు ఆడండి'' అనే మెసేజ్ వచ్చింది. అతని మాట ప్రకారం.. తొలి వన్డే ఆడాం" అని చెప్పాడు.

ఇదే విషయాన్ని జట్టు సభ్యులకు చెప్పాను
"ఆ తర్వాత, మేం కోల్పోయే మొత్తాన్ని ఇచ్చేందుకు ఆఫర్ చేశారు. ఇదే విషయాన్ని జట్టు సభ్యులకు చెప్పాను. మనం కచ్చితంగా సిరీస్ ఆడాలనే వారికి స్పష్టం చేశా. ఒక్క ఆటగాడు మినహా అంతా ఆడటానికి సుముఖత వ్యక్తం చేశారు. మూడు వన్డేలు ముగిసిన తర్వాత.. అది సమంజసం కాదని మాకు అనిపించింది" అని అన్నాడు.

ఆటగాళ్ల బెదిరింపుల మధ్య నాలుగు వన్డేల జరిగాయి
"అయినా సరే, ఆటగాళ్ల బెదిరింపుల మధ్య నాలుగు వన్డేల జరిగాయి. అయితే ఐదో వన్డే నాటికి సమస్య తీవ్రత ఎక్కువ కావడంతో ఆ మ్యాచ్ జరగలేదు. ఆ తర్వాత ఆ జీతాల సమస్యని మా బోర్డుతోనే తేల్చుకుందామని మేము భారత్‌ని విడిచిపెట్టి వెళ్లిపోయాం" అని డ్వేన్ బ్రావో వెల్లడించాడు. అప్పటి నుంచి విండిస్ జట్టులోని సీనియర్ క్రికెటర్లు డ్వేన్ బ్రావో, క్రిస్‌గేల్, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తదితరులు ఇప్పటికీ ఆ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు ఇష్టపడటం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications