For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త ట్విస్ట్: సెహ్వాగ్‌కు కోచ్ పదవి కష్టమే, కారణం ఇదీ

కొత్త కోచ్ ఎంపికలో బీసీసీఐకి కొత్త చిక్కు వచ్చింది. అనిల్ కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్ పదవి కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: కొత్త కోచ్ ఎంపికలో బీసీసీఐకి కొత్త చిక్కు వచ్చింది. అనిల్ కుంబ్లే నిష్క్రమణతో కొత్త కోచ్ పదవి కోసం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు బీసీసీఐ 7-10 రోజులు అవకాశం ఇచ్చింది.

సరైన అర్హత, అనుభవంతో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గత నెలలో కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, రిచర్డ్‌ పైబస్‌, దొడ్డ గణేశ్‌లతో పాటు అప్పటి కోచ్ అనిల్ కుంబ్లేలు తమ దరఖాస్తులను సమర్పించారు.

అయితే తాజాగా బీసీసీఐ మరోసారి దరఖాస్తులు ఆహ్వానించడంతో చాలా మంది ఆశ్యర్యానికి గురయ్యారు. రెండోసారి దరఖాస్తులను ఆహ్వానించడానికి కారణం ఏంటని కూడా ఆలోచించారు. అయితే అప్పడు దరఖాస్తు చేయని రవిశాస్త్రి కోసమే బీసీసీఐ మళ్లీ కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించిందని క్రికెట్ విశ్లేషకులు భావించారు.

శాస్త్రికి విరాట్‌ కోహ్లీ మద్దతు

శాస్త్రికి విరాట్‌ కోహ్లీ మద్దతు

ఇందుకు కారణం కాడా లేకపోలేదు. రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మద్దతు ఉండటమే. అయితే ఇప్పుడు తాజాగా మరో వాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కోచ్ రేసులో ఉన్న అభ్యర్ధుల ప్రొఫైల్స్‌ పట్ల గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ), బీసీసీఐ సంతృప్తిగా లేరనే ప్రచారం జరుగుతోంది.

రేసులో ఉన్న వారికి అనుభవం లేదు

రేసులో ఉన్న వారికి అనుభవం లేదు

రేసులో ఉన్న వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని టీమిండియా ప్రధాన కోచ్‌ పదవిని అప్పగించలేమని సీఏసీ పేర్కొంది. ఉదాహరణకు కోచ్ రేసులో ఉన్న సెహ్వాగ్‌ను తీసుకుంటే కోచింగ్‌ అనుభవం లేదు. కేవలం ఐపీఎల్‌లో ఒక జట్టుకి మాత్రమే కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

సెహ్వాగ్‌కి కోచ్‌ పదవి కష్టమే

సెహ్వాగ్‌కి కోచ్‌ పదవి కష్టమే

ఈ అనుభవాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకుని సెహ్వాగ్‌కి కోచ్‌ పదవిని అప్పగించలేమన్న యోచనలో బీసీసీఐ ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు జులై చివ‌ర్లో మొద‌ల‌య్యే శ్రీలంక పర్యటన లోపు కొత్త కోచ్ ఎంపిక‌ను మాత్రం పూర్తి చేస్తామ‌ని బోర్డు తాత్కాలిక అధ్య‌క్షుడు సీకే ఖన్నా స్ప‌ష్టంచేశారు.

కొత్త కోచ్ 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు

కొత్త కోచ్ 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు

కొత్త కోచ్ 2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌ర‌కు ఉంటాడ‌ని కూడా ఆయ‌న చెప్పారు. కాగా, బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, రిచర్‌ పైబస్‌, దొడ్డ గణేశ్‌ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

అప్పుడు రవిశాస్త్రిని కాదని కుంబ్లేకి కోచ్‌ పదవి

అప్పుడు రవిశాస్త్రిని కాదని కుంబ్లేకి కోచ్‌ పదవి

ఇదిలా ఉంటే గతేడాది టీమిండియా మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రిని కాదని కుంబ్లేకి కోచ్‌ పదవి అప్పగించిన సీఏసీ ఈసారి శాస్త్రికే కట్టబెట్టాలన్న ఆలోచనతో ఉండటం వల్లే బీసీసీఐ మరోసారి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోచ్‌ ఎంపిక ప్రక్రియ మరింత ఆసక్తిగా మారింది.

క్యూలో నిల‌బ‌డ‌ను.. ప‌ద‌వి ఇస్తానంటే అప్లై చేస్తా

క్యూలో నిల‌బ‌డ‌ను.. ప‌ద‌వి ఇస్తానంటే అప్లై చేస్తా

ఇందులో భాగంగా రవిశాస్త్రిని కూడా కోచ్ పదవి కోసం అప్లై చేసుకోమని బీసీసీఐ కోరింది. అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ ప‌ద‌వి కావాల‌ని అంద‌రిలాగా క్యూలో నిల‌బ‌డ‌ను.. క‌చ్చితంగా నాకే ఆ ప‌ద‌వి ఇస్తా అంటేనే చేస్తానని బీసీసీఐతో తేల్చి చెప్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీసీసీఐ ముందు తన కండిషన్స్ కూడా ఉంచాడంట.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+