కేబినెట్ సహాయంతో సేఫ్ జోన్‌లోకి బిసిసిఐ..

బిసిసిఐ అంత త్వరగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని ప్రభుత్వ పెద్దలకు తెలుసు అయినా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మూడేళ్ల క్రితం స.హ.చట్టం కమిషనర్ పద్మా బాలసుబ్రమణ్యం బిసిసిఐకు ఆర్‌టిఐ నుంచి మినాహాయింపునిచ్చారు. బిసిసిఐ జామా ఖర్చులను బహిరంగంగా వెల్లడించాలనే డిమాండ్ ఊపందుకొంటోంది. బిసిసిఐ భారత జట్టును దేశం పేరుమీదే ఆడిస్తోందని, కాబట్టి అది ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని క్రీడామంత్రిత్వ శాక మంత్రి అజరు మాకెన్ వాదన. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోని తాము వారికి ఎందుకు లోబడాలని అని బిసిసిఐ వితండవాదం చేస్తోంది.
ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు ఆర్‌టిఐ పరిధిలోకి వస్తాయని బిసిసిఐ అందుకు మినహాయింపు అని బిసిసిఐ ఉపాద్యాక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. బిసిసిఐ 'తమళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థ కాబట్టి ఏ పార్లమెంటరీ వ్యవస్థలు చెందము అని బోర్డు సమాధానమిస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అధ్యక్షుడు శరద్ పవార్ కొత్త క్రీడాబిల్లును బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోర్డుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఈ బిల్లుపై తనకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటున్నాడు. 'ప్రభుత్వం బిసిసిఐ పట్ల ఆందోళనచెందాల్సిన అవసరం లేదు. ఇది వ్యవస్థీకృత, వృత్తి నైపుణ్యంగల క్రీడా శాఖ. దేశంలో క్రీడా మౌలికసదుపాయల ఏర్పాటుకు కృషి చేస్తోంది' అని బిసిసిఐ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తెలిపాడు. జవాబుదారీ తనం వహించడానికి బోర్డు ఎందుకు వ్యతిరేకత తెలుపుతుందో తాను అర్ధం చేసుకోలేకపొతున్నానని క్రీడా మంత్రి అజరు మాకెన్ అన్నారు.
బిసిసిఐ పారదర్శకంగా వ్యవహరించి ఇతర క్రీడా బోర్డులకు ఆదర్శంగా నిలవాలని కొందరు ఎంపిలు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మాజీ క్రికెటర్ అరుణ్‌లాల్, కపిల్ దేవ్‌లు క్రీడా బిల్లుకు మద్దతిస్తున్నారు. ఆర్‌టిఐ పరిధిలోకి బిసిసిఐ రావడానికి నిరాకరించడం తప్పుడు చర్య అని వారన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి నష్టం కలిగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరిపిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.
మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రణబ్ ఈ విషయం తెలిపారు. ఇతర దేశాల నుంచి ఐపిఎల్‌లో అక్రమ నిధులు ప్రవహించాయనే ఆరోపణలు వచ్చాయని, వాటిపై ఈడీ దృష్టి సారించిందని జోరీ అవర్ సందర్భంగా ప్రణబ్ వెల్లడించారు. ఇదిలావుండగా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ బిసిసిఐ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. పలు అంశాల్లో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ స్వతంత్రంగా ముందుకు పోతున్న బిసిసిఐ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రణబ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన జాతీయ క్రీడా బిల్లుకు గట్టిగా ప్రయత్రిస్తున్నారు. దీంతో ఆయనకు కేంద్ర కేబినెట్‌లోని ఇతర మంత్రులతో విబేధాలు ఏర్పడ్డాయి.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications