అరుదైన గౌరవం, 11వ క్రికెటర్: పద్మభూషణ్‌కు ధోని పేరు సిఫారసు
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌కు సిఫారసు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను 2017 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారానికి సిఫారసు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ధోని పేరును బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా నామినేట్ చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ధోని కెప్టెన్సీలో టీమిండియా అద్భుత విజయాలను అందుకుంది. అతని కెప్టెన్సీలోనే భారత్ రెండు వరల్డ్ కప్‌లను గెలుచుకుంది' అని అన్నారు.

మన దేశ గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడు
'మన దేశ గొప్ప క్రికెటర్లలో ధోని ఒకడని.. వన్డేల్లో దాదాపు 10 వేల పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో 90 టెస్టు మ్యాచ్‌లాడాడు. పద్మభూషణ్ కోసం అతని పేరు సిఫార్సు చేయడం సరైన నిర్ణయమే' అని ఆయన తెలిపారు. ధోని నేతృత్వంలోని టీమిండియా 2011లో వన్డే, 2007లో టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను అందుకున్నాడు.

బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా
బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మాట్లాడుతూ ‘మహేంద్ర సింగ్ ధోని పేరును పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేసింది. బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లలో ధోని ఒకడు. అతడి పేరును దేశ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రతిపాదించడం సముచితమనిబోర్డు భావించింది' అని అన్నాడు.

11వ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు
ధోనికి పద్మభూషణ్ అవార్డు లభిస్తే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. అంతకు ముందు సచిన్ , కపిల్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, చందు బోర్డే, డీబీ డియోధర్, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్, రాజా బలీందర్ సింగ్, విజయ ఆనంద్‌లు పద్మభూషణ్ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు.

100 స్టంపౌట్ల రికార్డు సైతం
కాగా, ధోని ఇప్పటి వరకు 90 టెస్టుల్లో 4,876 పరుగులు సాధించగా.. 302 వన్డేల్లో 9,737 పరుగులు, 78 టీ20ల్లో 1,212 పరుగులు నమోదు చేశాడు. భారత జట్టుకు బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. ధోని నాయకత్వంలో టీమిండియా ఐసీసీ మూడు టోర్నీలను గెలుచుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 100 స్టంపౌట్ల రికార్డును నెలకొల్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications