Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCI New President: ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే - సౌరవ్ గంగూలీ ఇక మాజీ..!!

BCCI New President: Roger Binny is all set to be announced as the successor of Sourav Ganguly.

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వార్షిక సర్వ సభ్య సమావేశం మొదలైంది. ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ వేదికగా కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ఆరంభమైంది. ఇది కీలక సమావేశం. కొత్త అధ్యక్షుడితో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యుల ఎంపిక కూడా ఇదే భేటీలో జరుగనుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటివరకూ బీసీసీఐ ఛైర్మన్‌గా వ్యవహరించిన లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఇక మాజీ కాబోతోన్నారు.

బిన్నీ ఎన్నిక లాంఛనమే..

బిన్నీ ఎన్నిక లాంఛనమే..

సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ ఎన్నిక కానున్నారు. బిన్నీని ఎన్నుకోవడం లాంఛనప్రాయమే. బీసీసీఐ పదవికి నిర్వహించదలిచిన ఎన్నికలో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సౌరవ్ గంగూలీ దూరంగా ఉన్నారు. అదే సమయంలో బీసీసీఐ ప్రస్తుత కార్యదర్శి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా రెండోసారి కూడా అదే పదవిలో కొనసాగనున్నారు. రోజర్ బిన్నీని తదుపరి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడానికి, జై షాను కార్యదర్శిగా కొనసాగించడానికి బోర్డు సభ్యులు సైతం అంగీకారం తెలిపారు.

ఇవీ అంచనాలు..

ఇవీ అంచనాలు..

బీసీసీఐ ఎన్నికలు ముగిసిన తరువాత- అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా ఆశీష్ షెల్కర్, జాయింట్ సెక్రెటరీగా దేవజిత్ సైకియా నియమితులు కావడం ఖాయంగా కనిపిస్తోంది. బీసీసీఐ ఆధ్వర్యంలోనే నడిచే ఇండియన ప్రీమియర్ లీగ్ ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్ అపాయింట్ కావొచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.

హాజరైంది వీరే..

హాజరైంది వీరే..

ఈ ఉదయం ముంబైలో ఆరంభమైన వార్షిక సర్వ సభ్య సమావేశానికి సౌరవ్ గంగూలీ, జై షా, రోజర్ బిన్నీ, కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా హాజరయ్యారు. బీసీసీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇతర సభ్యులు, వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సాయంత్రం వరకూ కొనసాగనుందీ సమావేశం.

మళ్లీ క్యాబ్‌కే

మళ్లీ క్యాబ్‌కే

కాగా- బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్న తరువాత సౌరవ్ గంగూలీ ఏం చేస్తారనే విషయం మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కే వెళ్లనున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్ష పదవి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని గంగూలీ కూడా ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీలో కీలక పాత్రను పోషిస్తారనే అంచనాలు ఉన్నాయి. మెంటార్‌గా గంగూలీని తీసుకోవడానికి ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ ఆసక్తిగా ఉందని చెబుతున్నారు.

Story first published: Tuesday, October 18, 2022, 11:37 [IST]
Other articles published on Oct 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+