Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Team India : దిగ్గజాలు కావాలంటే డబ్బు పెట్టాల్సిందే.. బీసీసీఐకి భజ్జీ చురకలు

భారత్‌తో క్రికెట్ భవిష్యత్తును నిర్దేశించే పదవుల్లో చీఫ్ సెలెక్టర్ పదవి ఒకటి. జట్టును ఎటువైపు నడిపించాలనే ఆలోచన అతని దగ్గరి నుంచే పుడుతుంది. కానీ ఈ సీట్లో ఇప్పటి వరకు ప్రముఖ ప్లేయర్లు కూర్చోలేదు. మాజీలు చాలా మంది ఉన్నా కూడా.. ఎవరూ ఈ పదవిపై ఆసక్తి చూపడం లేదు. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.

చీఫ్ సెలెక్టర్ పోస్టు ఖాళీ..

చీఫ్ సెలెక్టర్ పోస్టు ఖాళీ..

తాజాగా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో చిక్కుకొని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంకా ఈ పోస్టులో బీసీసీఐ ఎవర్నీ నియమించలేదు. ఈ క్రమంలోనే దీనిపై మాట్లాడిన భజ్జీ.. చీఫ్ సెలెక్టర్‌కు కూడా కోచ్‌కు ఇచ్చినంత జీతం ఇస్తే ప్రముఖ క్రికెటర్లు ఈ బాధ్యతలు తీసుకోవడానికి మక్కువ చూపుతారని అన్నాడు. ఉదాహరణకు వీరేంద్ర సెహ్వాగ్ పేరును అతను ప్రస్తావించాడు.

ఎంత సంపాదిస్తారు?

ఎంత సంపాదిస్తారు?

'చాలా కాలం క్రికెట్ ఆడిన వాడు, ఒక స్థాయి ఉన్న వ్యక్తి చీఫ్ సెలెక్టర్‌గా ఉంటే చాలా సమస్యలు పరిష్కరించగలుగుతాడు. కానీ వాళ్లు ఈ పదవిపై ఆసక్తి చూపించడం లేదు? నేను వీరేంద్ర సెహ్వాగ్‌ను ఉదాహరణగా ఇస్తా. సెహ్వాగ్‌ను చీఫ్ సెలెక్టర్ చెయ్యాలంటే జీతం సరిగా ఉండాలి కదా. భారత్‌లో చీఫ్ సెలెక్టర్‌ ఎంత సంపాదిస్తాడో నాకు తెలీదు. కానీ సెహ్వాగ్ కనుక కామెంటరీ చెప్తూనో, లేదంటే మరే ఇతర క్రికెట్ సంబంధిత వ్యాపారంలోనో ఉన్నాడంటే.. అతను ఎక్కువ సంపాదిస్తున్నట్లే కదా' అని భజ్జీ అన్నాడు.

 సెహ్వాగ్ కావాలంటే డబ్బు పెట్టాలిగా..

సెహ్వాగ్ కావాలంటే డబ్బు పెట్టాలిగా..

సెహ్వాగ్ వంటి స్థాయి ఉన్న ఆటగాడిని చీఫ్ సెలెక్టర్‌గా తీసుకోవాలంటే డబ్బు ఖర్చు పెట్టడమే ముఖ్యమని చెప్పాడు. 'డబ్బు ఖర్చు పెట్టకపోతే ఈ పదవి కోసం.. ఒకటి, రెండేళ్లు క్రికెట్ ఆడిన వాళ్లలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తుంది. వాళ్లు అంత పెద్ద ఆటగాళ్లు కాకపోవచ్చు. రాహుల్ ద్రావిడ్ స్థాయి వ్యక్తిని కోచ్‌గా పెట్టినప్పుడు అంత స్థాయి ఆటగాడినే చీఫ్ సెలెక్టర్‌గా కూడా పెట్టాలి కదా' అని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే భజ్జీకి ఈ పదవి చేపట్టాలనే ఇంట్రస్ట్ ఉందా? అని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

కోచ్‌తో సమానంగా జీతం ఉంటే..

కోచ్‌తో సమానంగా జీతం ఉంటే..

'భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఉంటుంది. కోచ్, సెలెక్టర్లకు సమానంగా జీతం దొరుకుతుంటే ఎందుకు చెయ్యను? కోచ్ పని ఏంటి? జట్టుతో కలిసి ఉంటూ వాళ్ల కోసం స్ట్రాటజీలు సిద్ధం చేయడం. అలాగే సెలెక్టర్ పని కూడా అంతే ముఖ్యమైంది కదా. వాళ్లు బెస్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయాలి. కోచ్, కెప్టెన్‌కు అవసరమైన వాళ్లను సెలెక్ట్ చెయ్యలేకపోతే చీఫ్ సెలెక్టర్ పదవికి ఇక వాల్యూ ఏముంది?' అని భజ్జీ ప్రశ్నించాడు. ఇటీవలి కాలంలో సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడం వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ఓటమికి జట్టు ఎంపికే కారణమని చాలా మంది అభిప్రాయపడ్డారు.

Story first published: Sunday, February 26, 2023, 14:33 [IST]
Other articles published on Feb 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+