మహిళా క్రికెటర్ స్మృతీ మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తన ఆట తీరుతోనే గ్లామర్ తోనూ ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన సింగర్ ఎవరో తెలిపింది. డ్రెస్సింగ్ రూమ్‌లో తన ప్లే లిస్ట్‌లో ఉంటే టాప్ 3 పాటలు ఏంటో చెప్పింది.
తాజాగా బీసీసీఐ ప్రతిష్టాత్మక నమన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో దేశీయంగా, అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లను పురస్కారాలను అందించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పురుష, మహిళా క్రికెటర్లు ప్రత్యేక చిట్ చాట్ సెషన్ లో పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపారు. తన ప్రశ్నలు, సమాధానాలతో ఈవెంట్ లో నవ్వులు పూయించారు.

ఇందులో భాగంగానే డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లే చేసేందుకు తన ప్లే లిస్ట్‌లో ఉండే టాప్ 3 పాటలు ఏంటి? అని మంధానను హార్దిక్ అడిగాడు. "నేను ఎక్కువగా లవ్ సాంగ్స్ , విషాద గీతాలు ఉంటాయి. కారణం తెలీదు కానీ అలాంటివే ఎక్కువగా ఇష్టం. మ్యాచ్‌కు ముందు అందరూ ఎక్కువగా పంజాబీ పాటలను ఇష్టపడుతుంటారు. కానీ నేను ఇలాంటివే వింటాను. అందరూ నా సాంగ్స్ విని షాకవుతారు. అందుకే మ్యాచ్‌కు ముందు నేను నా హెడ్‌ఫోన్‌లోనే సాంగ్స్ వింటూ ఆస్వాదిస్తాను " అని స్మృతి పేర్కొంది. ముఖ్యంగా అర్జిత్ సింగ్ పాటలంటే మరింత ఇష్టమని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ క్రికెట్ టీమ్ సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
తాజాగా జరిగిన ఈ బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో.. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా,
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన అవార్డులను అందుకుంది.