న్యూఢిల్లీ: జగ్మోహన్ దాల్మియా బహిష్కరణ వ్యవహారంపై తమ ఆరు ఉన్నత స్థాయి అధికారులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నిధులను దుర్వియోగం చేశారని బిసిసిఐ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని ఆరోపిస్తూ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పై, మరో ఐదుగురిపై క్రిమినల్ ప్రోసీడిగ్స్ చేపట్టాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.
శరద్ పవార్, బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, మరో నలుగురు అధికారులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై చేపట్టాలని నవంబర్ 12వ తేదీన కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది నెలల క్రితం తన బహిష్కరణపై దాల్మియా హైకోర్టులో కేసు వేశారు.