For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్‌.. లీగ్ చరిత్రలో కనీవినీ ఎరుగని ధరకు..!!

BCCI could earn up to 35-40 crores from IPL broadcasting rights.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన క్రికెట్‌ లీగ్‌ ఏదంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏటా దీని విలువ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 8 జట్లతో జరిగిన లీగ్‌.. వచ్చే ఏడాది నుంచి 10 జట్లతో జరగనుంది. దాంతో ఐపీఎల్ మరిన్ని మ్యాచులతో అభిమానులను అలరించనుంది. వచ్చే సీజన్ నుంచి రెండు కొత్త జట్లు చేరనుండడంతో బీసీసీఐకి భారీ ఆదాయం కూడా రానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం కంటే 15000-2000 కోట్లు అదనంగా ఆదాయం రానుందని సమాచారం తెలుస్తోంది.

రూ. 35-40 వేల కోట్ల ధర:

రూ. 35-40 వేల కోట్ల ధర:

ఐపీఎల్‌కు మరో జాక్‌పాట్‌ తగలనుంది. లీగ్‌ ప్రసార హక్కులు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడుపోనున్నాయని తెలుస్తోంది. వచ్చే అయిదేళ్ల కోసం ఐపీఎల్‌ ప్రసార హక్కుల ధర రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ పలుకుతుందని అంచనా. 2018 నుంచి 2022 వరకూ అయిదేళ్ల కాలానికి గాను గతంలో రూ.16,347 కోట్లు చెల్లించి స్టార్‌ ఇండియా.. ఆ హక్కులను సొంతం చేసుకుంది. వచ్చే అయిదేళ్లకు అంతకంటే చాలా ఎక్కువ ధరే పలికే అవకాశాలున్నాయి. అయితే టీవీ, డిజిటల్‌ ప్రసార హక్కులకు కలిపి రూ. 35-40 వేల కోట్ల ధర పలకవచ్చని తెలుస్తోంది. ఏదిఏమైనా వచ్చే ఏడాది మాత్రం బీసీసీఐకి కాసుల వర్షం కురవనుంది.

60 నుంచి 74కు:

60 నుంచి 74కు:

వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్ లీగ్‌లో 10 జట్లు తలపడుతున్నాయి. రెండు కొత్త ప్రాంఛైజీల కోసం ఆర్పీఎస్‌జీ రూ.7090 కోట్లు, సీవీసీ క్యాపిటల్స్‌ రూ.5625 కోట్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. దాంతో రూ.12,715 కోట్లు ఐపీఎల్‌ ఖజానాలో చేరనున్నాయి. వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పెరుగుతుంది. ఆ తర్వాత సీజన్లలోనూ మ్యాచ్‌ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేలా స్టార్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు వచ్చే సీజన్లలో మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రసార హక్కుల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికలకు ఆదరణ పెరిగింది. దీంతో ఐపీఎల్‌ ప్రసార హక్కులు దక్కించుకునేందుకు అవి కూడా పోటీపడే ఆస్కారముంది. వాటి మధ్య పోటీ కూడా ఈ రేటు పెరిగేందుకు ఓ కారణం.

ఐపీఎల్ 15 కోసం మెగా వేలం:

ఐపీఎల్ 15 కోసం మెగా వేలం:

ఐపీఎల్ 15 కోసం మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని పూర్తి చేసే పనిలో పడింది. బోర్డు రూపొందించిన ఈ పాలసీకి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఒక్కక్కొటిగా వెలుగులోకి వస్తున్నాయి. పాత జట్లలోని ప్రతీ టీమ్ గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకోవచ్చట. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు, మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉండొచ్చు లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ ఉండాలి. పాత జట్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు, వేలానికి అందుబాటులో ఉండే జాబితా నుంచి కొత్తగా వచ్చిన జట్లు ముగ్గురి ప్లేయర్లను తీసుకోవాలి. ఆ తర్వాతే మెగా వేలం జరుగుతుందని సమాచారం.

Story first published: Friday, November 12, 2021, 8:57 [IST]
Other articles published on Nov 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+