
సత్కరించిన బీసీసీఐ:
మొతేరా స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కు ప్రత్యేక బ్లూ కలర్ క్యాప్‌ను కూడా జై షా అందజేశారు. అనంతరం ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. ఆపై గవాస్కర్‌కు మైదానంకు సంబందించిన విషయాలను తెలిపారు. 'టీమిండియా తరఫున సునీల్ గవాస్కర్ జీ టెస్ట్ అరంగేట్రం చేసి నేటికి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ వార్షికోత్సవాన్ని జరుపుకునేందుకు నాతో చేరండి. ఇది భారతీయులందరికీ ఒక ముఖ్యమైన సందర్భం. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోడీ స్టేడియంలో జరుపుకుందాం' అని షా ట్వీట్ చేశారు.

ఫస్ట్ క్రికెటర్‌గా అరుదైన ఘనత:
భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. 236 నాటౌట్ అత్యధిక స్కోర్. టెస్టు క్రికెట్లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.

71వ పుట్టిన రోజు సందర్భంగా:
లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన 71వ పుట్టిన రోజు సందర్భంగా పేద పిల్లల పట్ల సహృదయత కనబరిచిన విషయం తెలిసిందే. గుండె జబ్బుతో బాధపడుతున్న 35 మంది పిల్లల చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును అందించారు. అంతర్జాతీయ క్రికెట్లో గవాస్కర్ చేసిన సెంచరీలకు ఇది సమానం. సన్నీ ఆర్థిక సహాయంతో ముంబైలోని శ్రీ సత్యసాయి సంజీవని దవాఖానలో హృద్రోగ చిన్నారులకు చికిత్స అందింది. ఇక గతేడాది కరోనా వైరస్‌పై పోరాటానికి తన వంతు సాయంగా రూ.59 లక్షలు విరాళంగా ఇచ్చారు.
|
స్పిన్నర్ల హవా:
ఇంగ్లండ్‌తో జరుగుతున్నచివరిదైన నాలుగవ టెస్టులో భారత స్పిన్నర్లు హవా నడుస్తోంది. రెండవ ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరి దాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. దీంతో 13 ఓవర్లలోనే ఇంగ్లండ్ తొలి నాలుగు వికెట్లను కోల్పోయింది. అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ కూడా రెండు వికెట్లు వేసుకున్నాడు. క్రీజులో జో రూట్, ఓలి పోప్ ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 124 పరుగులు వెనకబడి ఉంది.
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం (వీడియో)