For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Rohit Sharma: రోహిత్ శర్మ టెస్టు భవిష్యత్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!

Rohit Sharma: రోహిత్ శర్మ టెస్టు భవిష్యత్తుకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నట్లు సమాచారం. 2007 తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు కూడా. అయితే రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆసీస్ తో సిరీస్ లను కోల్పోయినా రోహిత్ పై నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ కెప్టెన్సీలో రెండు సిరీస్‌లలో ఓటమి
న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత జట్టు ఓడిపోయింది. దీని తర్వాత కూడా రోహిత్ శర్మ ఇంగ్లాండ్ లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్ 2025 చివరివారంలో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో సిరీస్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో అందుబాటులో ఉండే ఆటగాళ్లపై స్పష్టత రానుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు ముందు 'లయన్స్' తో రెండు నాలుగు రోజుల మ్యాచ్ లు జరుగుతాయి. రెండు నాలుగు రోజుల మ్యాచ్ లకు సెలక్టర్ల కమిటీ ఇండియా ఏ జట్టును ఎంపిక చేస్తుంది. ఈ మ్యాచ్‌లు సీనియర్ జట్టు సిరీస్‌కు ముందు జరుగుతాయి. ఈ జట్టులో భారతదేశంలోని కొంతమంది కీలక ఆటగాళ్ళు ఉంటారు.

BCCI Makes Key Decision on Rohit Sharma s Test Future

10 టెస్టుల్లో 164 పరుగులు మాత్రమే..
భారత జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపు గురించి ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతున్నాయియ సెప్టెంబర్ 2024 నుంచి జనవరి 2025 మధ్య 10 టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ ప్రదర్శన చాలా పేలంగా ఉంది. రోహిత్ 6.2 సగటుతో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ ను కూడా పర్యవేక్షిస్తామని నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనలో తనకు తగిలిన వెన్ను గాయం నుంచి బుమ్రా ఇంకా కోలుకోవడం లేదు. ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లలో బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫున ఆడడం లేదు.

Take a Poll

ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా 45 రోజుల పాటు ఇంగ్లండ్ లో పర్యటించనుంది. జూన్ 20న హెడింగ్లీలో ఇంగ్లండ్ తో తొలి టెస్టు ప్రారంభం కానుంది. అంతకు ముందు మే 30న కాంటెర్బరీలో సెయింట్ లారెన్స్ తొలి నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుండగా.. జూన్ 6న నార్తాంప్టన్ లో రెండో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Story first published: Thursday, March 27, 2025, 10:52 [IST]
Other articles published on Mar 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+