Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, హార్దిక్ కాదు.. వరల్డ్ కప్ వరకు అతనే కెప్టెన్!

టీ20 వరల్డ్ కప్-2026ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా కొత్త కెప్టెన్‌ను సిద్ధం చేస్తున్నారు. నయా కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు తీవ్రంగా చర్చించి హార్దిక్ పాండ్యను భవిష్యత్ కెప్టెన్ ప్రణాళిక నుంచి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌‌ను భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పాడు.

దీంతో టీ20 ఫార్మాట్‌లో భారత సారథి స్థానం ఖాళీ అయ్యింది. అయితే రోహిత్ గైర్హాజరీలో మొన్నటివరకు హార్దిక్ పాండ్య టీ20ల సిరీస్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో రోహిత్ అనంతరం హార్దిక్‌నే ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ కెప్టెన్సీ రేసులో కొత్త పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్‌ను సారథిగా తీర్చిదిద్దాలని గంభీర్, కోచ్‌లు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

BCCI Likely to Keep Suryakumar Yadav as Captain Until T20 World Cup 2026

రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ఓ టీ20 సిరీస్‌కు సారథిగా బాధ్యతలు ఇప్పటికే నిర్వర్తించాడు. కానీ సీనియర్లు దూరమవ్వడంతో సూర్యకు ఆ ఛాన్స్ దక్కింది. అయితే ఇప్పుడు ప్రణాళికలు పూర్తిగా మారిపోయాయి. టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే టీ20లకు కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు జాతీయ మీడియా రాసుకొచ్చింది. దీంతో జులై 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టీ20 సిరీస్‌కు సూర్య కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

సూర్యనే ఎందుకు?
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్సీ రేసులో చాలా పేర్లు వినిపించాయి. హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ రేసులో నిలిచారు. వీళ్లతో పాటు ఐపీఎల్-2024 విజేత శ్రేయస్ అయ్యర్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. అయితే హార్దిక్‌ వరుస గాయాలతో జట్టులో రెగ్యులర్‌గా ఉండట్లేదు. ఇక రాహుల్, శ్రేయస్, రుతురాజ్‌కు జట్టులో స్థానమే ప్రశ్నార్థకం. కెప్టెన్సీలో గిల్ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాడు.

బుమ్రా మాత్రం కెప్టెన్సీ విషయంలో సూర్యకు గట్టి పోటీ ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ ముందు ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును బుమ్రా నడిపించాడు కూడా. కానీ పనిభారంతో పాటు కెప్టెన్సీ ఒత్తిడి బుమ్రాపై తీసుకురావద్దని బీసీసీఐ సూర్యను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక సూర్య గత కొన్నేళ్లుగా టీ20 బ్యాటర్లలో టాప్-2లోపే కొనసాగుతున్నాడు. టీ20ల్లో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. దీంతో సూర్యను ఎంపిక చేయాలని చూస్తోంది.

Story first published: Tuesday, July 16, 2024, 22:06 [IST]
Other articles published on Jul 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+