Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో ప్రక్షాళన పూనుకున్న బీసీసీఐ - టీ20 ప్రపంచకప్ ఒక్కటే అడ్డు..!!

BCCI likely to change the selection committee including Chetan Sharma after the T20 World Cup.

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌లో ఓ కీలక అంకం ముగిసింది. మూడు సంవత్సరాల సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి తెర పడింది. దాదా స్థానంలో కర్ణాటకకు చెందిన టీమిండియా మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ- బీసీసీఐ అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా నియమితులయ్యారు. కార్యదర్శిగా జై షా కొనసాగుతున్నారు. జాయింట్ సెక్రెటరీగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా ఆశీష్ షెలార్‌ను ఎన్నుకుంది బీసీసీఐ సర్వసభ్య సమావేశం.

మరో ప్రక్షాళన..

మరో ప్రక్షాళన..

బీసీసీఐలో ఇప్పుడు మరో ప్రక్షాళన చోటు చేసుకునే అవకాశం ఉంది. సెలెక్షన్ కమిటీలో సమూల మార్పులను తీసుకుని రానుంది. టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన వెంటనే ఈ దిశగా బీసీసీఐ కొత్త నాయకత్వం చర్యలు తీసుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో జట్టు పెర్ఫార్మెన్స్ ఆధారంగా సెలెక్షన్ కమిటీలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. బీసీసీఐకి కొత్త నాయకత్వం రావడం, అదే సమయంలో జట్టు టీ20 ప్రపంచకప్ ఆడుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

చేతన్ శర్మ పనితీరుపై..

చేతన్ శర్మ పనితీరుపై..

సౌరవ్ గంగూలీ హయాంలో సెలెక్షన్ కమిటీలో నియామకాలు చోటు చేసుకున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ- సెలెక్షన్ కమిటీని ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్‌గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ చేతన్ శర్మను అపాయింట్ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు సౌరవ్ గంగూలీ సెలెక్టర్లను నియమించారు. చేతన్ శర్మతో పాటు అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతి ఇందులో ఉన్నారు. 2020లో సెలెక్షన్ కమిటీ ఏర్పాటైంది.

ఆ ఇద్దరూ అవుట్..

ఆ ఇద్దరూ అవుట్..

ఇప్పుడీ ముగ్గురూ పదవులను కోల్పోయే ప్రయాదం ఏర్పడిందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. చేతన్ శర్మ పనితీరు పట్ల బీసీసీఐ కొత్త నాయకత్వం సంతృప్తిగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో అభయ్ కురువిల్లా, దేబాశీష్ మొహంతిని సాగనంపడం ఖాయమని సమాచారం. ఈస్ట్ జోన్‌కు చెందిన దేబాశిష్ మొహంతి నాలుగు సంవత్సరాలుగా బీసీసీఐలో కొనసాగుతున్నారు. జూనియర్, సీనియర్ సెలక్షన్ ప్యానెల్‌లో ఆయన పని చేశారు. 2019లో దేవాంగ్ గాంధీ స్థానంలో మొహంతి నియమితులయ్యారు.

ఈ ఇద్దరూ ఇన్..

ఈ ఇద్దరూ ఇన్..

ఇద్దరు మాజీ క్రికెటర్లు, ఒడిశాకు చెందిన మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్ పశ్చిమ బెంగాల్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న దీప్ దాస్‌గుప్తా, జాతీయ జూనియర్ సెలెక్టర్ రణదేబ్ బోస్.. సెలెక్షన్ కమిటీ పదవుల కోసం పోటీలో ఉండొచ్చని అంటున్నారు. రణదేబ్ బోస్ జాతీయ జట్టు తరఫున ఆడకపోవడం మైనస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే. బెంగాల్‌కే చెందిన మాజీ వన్డే ప్లేయర్లు లక్ష్మీ రతన్ శుక్లా, ఒడిశాకు చెందిన సంజయ్ రౌల్‌ను తీసుకోవచ్చని సమాచారం.

Story first published: Wednesday, October 19, 2022, 9:43 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+