ఇండియాలోనే వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ - 2025.. పావులు కదుపుతున్న బీసీసీఐ

2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమిచ్చేలా పావులు కదుపుతోంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈ గ్లోబల్ ఈవెంట్ కోసం వేలం వేయడానికి సిద్ధమైంది. ఒకవేళ ఈ వేలాన్ని గనుక బీసీసీఐ గెలిస్తే ఒక దశాబ్దం తర్వాత మహిళల వన్డే ప్రపంచకప్ భారత్‌కు తిరిగి వస్తుంది. 2013లో ఇండియా ఈ మహిళల వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. అప్పుడు ముంబయిలో జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్‌ను 114పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా అవతరించింది.

తదుపరి సైకిల్లో కీలక ఐసీసీ ఈవెంట్ల కోసం బిడ్డింగ్
ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వార్షిక సమావేశం బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. తదుపరి నాలుగు సంవత్సరాల షెడ్యూల్ సైకిల్లో (2023 నుంచి 2027) జరిగే ఐసీసీ మహిళల ఈవెంట్ల కోసం బిడ్‌లు ఈ సమావేశంలో ఆమోదించబడతాయని పీటీఐ పేర్కొంది. అందులో 2024, 2026 ఐసీసీ T20 ప్రపంచకప్ టోర్నీలు, అలాగే 2025ల వన్డే ప్రపంచ కప్ టోర్నీలు కీలకమైనవి.

చివరిసారిగా 2016లో ఐసీసీఐ ఈవెంట్
భారతదేశంలో చివరిసారిగా మహిళల గ్లోబల్ ఈవెంట్ 2016లో జరిగింది. ఆ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్లో జరిగింది. అప్పుడు ఐసీసీ మెన్స్ మరియు మహిళల ఈవెంట్లను ఏకకాలంలో నిర్వహించారు. రానురాను మహిళల ఆటకు జనాదరణ పెరిగిపోతుండడంతో సిస్టమ్ మారిపోయింది. మహిళల క్రికెట్ టోర్నీలకు కూడా ప్రత్యేక ప్రసార ఒప్పందాలు, ప్రత్యేక కవరేజీలు వచ్చేశాయి. మహిళల ఆటకు సరైన విలువను ఆపాదించడానికి ఐసీసీ పురుషుల క్రికెట్‌తో కాకుండా సెపరేటుగా ఈవెంట్లను నిర్వహిస్తోంది.

వేలం గెలిస్తే బీసీసీఐకి కాసుల వర్షం
2025 వన్డే ఈవెంట్ కోసం బీసీసీఐ గనుక ఆతిథ్య హక్కల కోసం వేలం వేస్తే అది బీసీసీఐకి కాసులు కురిపించే అవకాశముందని ఐసీసీకి చెందిన ఓ అధికారి అన్నట్లు సమాచారం. బీసీసీఐ వచ్చే సీజన్ నుంచి మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడానికి చూస్తున్నందున టీ20 మహిళల ప్రపంచకప్ ఈవెంట్లను నిర్వహించడానికి బీసీసీఐ పెద్దగా సముఖత వ్యక్తం చేయనట్లు కన్పిస్తోంది. అందువల్ల 2025 వన్డే ప్రపంచ కప్ కోసం వేలం వేయాలని బీసీసీఐ నిర్ణయానికొస్తున్నట్లు తెలుస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో ఆడే జట్లు ఎలా ఎంపికవుతాయంటే..?
2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లు ఎలా ఎంపికవుతాయంటే.. ఆతిథ్యం ఇచ్చే దేశ జట్టు ఆటోమేటిక్ గా ఎంపికవుతుంది. అలాగే ICC వుమెన్స్ ఛాంపియన్‌షిప్ (IWC) 2022-2025లో ఐదు అగ్ర దేశాలు టోర్నమెంట్‌లో నేరుగా ప్రవేశం పొందుతాయి. మిగిలిన రెండు జట్లను ఆరు జట్లతో కూడిన గ్లోబల్ క్వాలిఫైయర్ ద్వారా ఎంపికచేస్తారు. క్వాలిఫైయర్‌లోని ఆరు జట్లలో.. నాలుగు IWC (టాప్ ఐదు జట్ల తర్వాత ర్యాంకింగ్స్) నుంచి తీసుకుంటారు. మిగిలిన రెండు జట్లు ICC మహిళల వన్డే టీమ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపికవుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications