
రెండు సిరీసుల్లో ఇషాన్
ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అటు టీ20లు, ఇటు వన్డేలు రెండు జట్లలో అవకాశం కల్పించారు సెలెక్టర్లు. కొన్నిరోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా అతను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇషాన్‌కు టీ20లతో పాటు వన్డే జట్టులో కూడా చోటు కల్పిస్తూ బీసీసీఐ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

టీ20లకే సంజూ పరిమితం..
అభిమానులంతా కూడా కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా సంజూకు అవకాశాలు ఇవ్వాలని ఇటీవలే ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు ప్రకటించారు. అతనితోపాటు ఇషాన్ కిషన్ కూడా టీ20లకు ఎంపికయ్యాడు. వీళ్లిద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎవరిని ఆడిస్తారనేది అనుమానంగా ఉంది.

టీ20లకు సీనియర్లు దూరం..
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తదితరులు దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చినట్లు సెలెక్టర్లు ప్రకటించారు. టీ20 సిరీస్‌లో జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతని డిప్యూటీగా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు.
భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్,


Click it and Unblock the Notifications












