Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: వచ్చే ఐపీఎల్ కోసం కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. రేంజ్ పెరగడం ఖాయం!

ఐపీఎల్‌ రేంజ్ పెంచేందుకు బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఫ్యాన్స్‌ మజా కూడా మరో స్థాయికి చేరడం ఖాయమని నిపుణులు అంటున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు ఖర్చు పెట్టే మొత్తాన్ని మరింత పెంచనున్నట్లు తెలిపింది. గతేడాది మినీ వేలానికి ముందు కూడా ఫ్రాంచైజీల పర్సు వాల్యూను బీసీసీఐ పెంచిన సంగతి తెలిసిందే.

ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం జరిగే వేలంలో కూడా ఇలాగే పర్సు వాల్యూ పెంచాలని ఫిక్స్ అయింది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఫ్రాంచైజీల పర్సు వాల్యూను రూ.100 కోట్లకు పెంచాలని బీసీసీఐ భావిస్తోందట. వచ్చే ఐపీఎల్ కోసం ఈ ఏడాది చివర్లో మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో ఫ్రాంచైజీలన్నీ కూడా కొత్త పర్సు విలువతోనే వేలం బరిలో దిగుతాయని తెలుస్తోంది.

BCCI key decision to improve IPL for the next stage

అంతేకాదు, ఆయా జట్లు ఎంతమంది కావాలంటే అంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఈసారి ఉంటుందట. ఇలా ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా మిగిలిన ఆటగాళ్లకు మాత్రమే వేలం నిర్వహిస్తారని సమాచారం. క్రిస్మస్ సెలవుల సమయంలో వేలం నిర్వహించ కూడదని అనుకుంటున్న బీసీసీఐ.. ఈ పండుగ ముగిసిన తర్వాత వేలం నిర్వాహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వేలం నిర్వహించే తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ వేలం పాటను నిర్వహించే వేదికను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై, జైపూర్, అహ్మదాబాద్, కోచి, కోల్‌కతా నగరాలను దీని కోసం షార్ట్ లిస్ట్ చేశారట.

వీటిలోనే ఒక నగరంలో వేలం నిర్వహిస్తారు. గతేడాది కోచి నగరంలో ఐపీఎల్ మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేలంలో పది ఫ్రాంచైజీలు కలిపి రూ.167 కోట్లు ఖర్చు చేసి 80 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

Story first published: Monday, July 24, 2023, 11:10 [IST]
Other articles published on Jul 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+