IND VS NZ: ఫైనల్ తర్వాత రోహిత్ శర్మకు బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆయా జట్లు నిష్క్రమించిన తర్వాత పలువురు ఆటగాళ్లు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్మీవ్ స్మిత్, ముష్ఫికర్ రహీం వన్డేలకు గుడ్ బై చెప్పగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫైనల్ మ్యాచ్ తర్వాత వన్డేలకు రిటైర్మంట్ ప్రకటించడం లేదా కెప్టెన్సీకి రాజీనామా చేయడం చేసే అవకాశాం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఫైనల్ తర్వాత కెప్టెన్సీ మార్పు విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారం ఓ వైపు కొనసాగుతుండగానే.. తాజాగా మరో కొత్త సమాచారం బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే రోహిత్ కు బీసీసీఐ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
అదేంటంటే న్యూజిలాండ్ తో జరగబోయే ఫైనల్ లో భారత జట్టు విజయం సాధిస్తే.. బోర్డు రోహిత్ కెప్టెన్సీని మరో రెండేళ్ల పాటు పొడిగించొచ్చు అని క్రికెట్ వర్గాలు తెలిపాయి. 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగిస్తుందని అంటున్నారు. అయితే దీనిపై హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రిటైర్మెంట్ విషయానికొస్తే.. ఈ ఫైనల్ తర్వాత రోహిత్ వీడ్కోలు చెబుతాడా లేడా అనేది అతడి వ్యక్తిగత విషయమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

కొనసాగుతాడా లేదా?
వచ్చే ఏప్రిల్ నెలలో రోహిత్ కు 38 ఏళ్లు నిండుతాయి. అంటే దక్షిణాఫ్రికా, జంబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచ కప్ సమయానికి రోహిత్ కు 40 ఏళ్లు దాటుతాయి. కాబట్టి అప్పటి వరకు అతడు వన్డేల్లో కొనసాగుతాడా లేదా అనేది అతడి ఫిట్ నెస్ పై ఆధారపడి ఉంటుంది.
A tale of many firsts 🙌🙌@ImRo45 becomes the first Captain to lead his team to the final of all four major ICC men's tournaments.#TeamIndia pic.twitter.com/FXzPwNO3Xu
— BCCI (@BCCI) March 6, 2025
ఏకైక కెప్టెన్ గా రోహిత్..
గతేడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 ఛాంపియన్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత అతడు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. తద్వారా ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఓ ఘనతను హిట్ మ్యాన్ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications