For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో ఒప్పందం చేసుకున్న బీసీసీఐ.. ఈసారి ఎస్బీఐ లైఫ్‌తో!

వచ్చే అంతర్జాతీయ, దేశీయ సీజన్‌లో టీమిండియా అధికారిక భాగస్వామిగా ఎస్బీఐ లైఫ్ ఎంపికైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ కొత్త సీజన్ కోసం వరుసగా ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జెర్సీ స్పాన్సర్‌గా ఆదిదాస్‌తో ఒప్పందం చేసుకున్న బీసీసీఐ.. టీం స్పాన్సర్‌గా డ్రీమ్11తో ఒప్పందం చేసుకుంది.

2023-2026 అంతర్జాతీయ, దేశవాళీ సీజన్‌ కోసం ఎస్బీఐ లైఫ్‌తో చేతులు కలిపినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్‌లో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఎస్బీఐ లైఫ్ ఒకటనే సంగతి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడు వన్డేల సిరీసుతో ఎస్బీఐ లైఫ్‌తో భాగస్వామ్యం మొదలవుతుందని బీసీసీఐ తెలిపింది.

BCCI

'ఎస్బీఐ లైఫ్‌ మా అధికారిక భాగస్వామిగా చేరిందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాం. దేశవాళీ, అంతర్జాతీయ సీజన్లు రెండింటికీ ఎస్బీఐ లైఫ్‌.. బీసీసీఐ అధికారిక పార్టనర్‌గా ఉంటుంది. ఇన్సూరెన్స్ విభాగంలో టార్చ్ బేరర్‌గా ఉన్న ఎస్బీఐ లైఫ్‌తో కలిసి భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం' అని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ చెప్పారు.

'బీసీసీఐ అధికారిక భాగస్వామిగా ఎస్బీఐ లైఫ్‌ను ఆహ్వానించేందుకు ఆనందిస్తున్నాం. వచ్చే మూడేళ్లపాటు డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సీజన్‌కు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. ఐసీసీ వరల్డ్ కప్ ముందు ఈ ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషకరం. ఎప్పుడూ మెరుగవడానికి ప్రయత్నించే ఎస్బీఐ లైఫ్ కమిట్‌మెంట్.. క్రికెట్‌లో బీసీసీఐ విజన్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ భాగస్వామ్యం మంచి ఫలదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం' అని బీసీసీఐ సెక్రటరీ జై షా అన్నారు.

ఇలా కొత్త భాగస్వామ్యాలతో ముందుకెళ్తున్న బీసీసీఐ.. క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, వరల్డ్ కప్‌ కోసం టీమిండియా కొత్త జెర్సీని ఆదిదాస్ రిలీజ్ చేసింది. అలాగే టీమిండియా జెర్సీ విడుదల సమయంలో థీమ్ సాంగ్ కూడా ప్రకటించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా సాంగ్ అదిరిపోయిందని, వరల్డ్ కప్ థీమ్ సాంగ్ కన్నా ఇదే బాగుందని అంటున్నారు.

Story first published: Wednesday, September 20, 2023, 22:53 [IST]
Other articles published on Sep 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+