చర్యలకు సిద్ధం: నోరు జారిన పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు


హైదరాబాద్: బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిక్కుల్లో పడ్డారు. ఈ టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను బీసీసీఐ వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది.
ఈ టాక్ షోలో హార్ధిక్ పాండ్యా చేసిన ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరచడమే కాకుండా, భారత సంస్కృతిని దిగజార్చాలే ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.
కాఫీ విత్ కరణ్ షోలో
ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా "నేను ఈ మధ్యకాలంలో మూడు విషయాలను తెలుసుకున్నా. మొదటి విషయం ఏంటంటే.. ఒక అమ్మాయిని చూడటం. రెండోది డేటింగ్. మూడోది రిలేషన్‌షిప్" అని సమాధానమిచ్చాడు.

ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పిన పాండ్యా
దీంతో పాటు తన తల్లిదండ్రులతో తాను ఎంతో సన్నిహితంగా ఉంటానని, తాను కలిసి అమ్మాయిల సంగతి కూడా తాను వాళ్లతో షేర్ చేసుకున్నానని పాండ్యా చెప్పాడు. దీనిపై విమర్శలు రావడంతో పాండ్యా ట్విట్టర్‌లో క్షమాపణ కూడా చెప్పాడు. కాఫీ విత్ కరణ్ షోలో ఓ క్రికెటర్‌గా పాండ్యా తన స్థాయికి తగ్గట్టు మాట్లాడకపోవడం పట్ల బీసీసీఐ గుర్రుగా ఉంది.

ఎవరు బెస్ట్ ప్లేయర్? వివాదం
అసలు క్రికెటర్లు క్రికెట్‌తో సంబంధం లేని షోలలో ఎందుకు పాల్గొంటున్నారన్న దానిపై బోర్డు దృష్టి సారించింది. ట్విట్టర్ వేదికగా పాండ్యా క్షమాపణ చెప్పినప్పటికీ.. అది సరిపోదని భావిస్తోన్న బోర్డు అతడిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. సచిన్, కోహ్లీలలో ఎవరు బెస్ట్ ప్లేయర్ అనే ప్రశ్నకు గాను కోహ్లీనే అంటూ వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications