For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసు

BCCI Issues Show-Cause Notice To Dinesh Karthik || Oneindia Telugu
 BCCI issues show-cause notice to Dinesh Karthik for visiting Trinbago Knight Riders dressing room in CPL

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లోని ఫ్రాంచైజీ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు ప్రమోషనల్‌ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు దినేశ్‌కు బీసీసీఐ నోటీసు పంపింది. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ యజమాని అన్న సంగతి తెలిసిందే.

తొలి మ్యాచ్‌కు హాజరైన దినేశ్‌ కార్తీక్

తొలి మ్యాచ్‌కు హాజరైన దినేశ్‌ కార్తీక్

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో సెయింట్‌ కిట్స్‌తో జరిగిన నైట్‌రైడర్స్‌ తొలి మ్యాచ్‌కు హాజరైన దినేశ్‌ కార్తీక్ ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో జెర్సీ వేసుకొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన చర్య కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ దినేశ్‌కు బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రీ నోటీస్‌ పంపాడు.

బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ

బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ

దీనిపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ "అవును, దినేష్ కార్తీక్‌కు బిసిసిఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో కార్తీక్ కనిపించిన ఫోటోలు మాకు వచ్చాయి. ఈ క్రమంలో తన కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయకూడదో వివరించమని బిసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ షో-కాజ్ నోటీసు జారీ చేశారు" అని అన్నారు.

బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో

బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో

ఇండియా తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన దినేశ్ కార్తీక్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జెర్సీని ధరించి బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించాడు. ఐపీఎల్‌లో షారుఖ్ ఖాన్ సహా యజమానిగా ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ విండిస్‌లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి బీసీసీఐ నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు.

ఏ ప్రైవేట్ లీగ్‌తో సంబంధం కలిగి ఉండకుండా

ఏ ప్రైవేట్ లీగ్‌తో సంబంధం కలిగి ఉండకుండా

దీనిపై ఆ అధికారి మాట్లాడుతూ "కాంట్రాక్టు కుదుర్చుకున్న క్రికెటర్‌గా, దినేష్ కార్తీక్‌కు ఐపీఎల్ లేని ఓ ఫ్రాంచైజ్ లీగ్‌లో ఎటువంటి సంబంధం లేదు. అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ఏ ప్రైవేట్ లీగ్‌తో సంబంధం కలిగి ఉండకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్-క్లాస్ క్రికెటర్లకు బీసీసీఐ విధించిన నిబంధన" అని చెప్పారు. అయితే, దీనిపై మాట్లాడేందుకు దినేశ్ కార్తీక్ నిరాకరించాడు.

Story first published: Saturday, September 7, 2019, 9:26 [IST]
Other articles published on Sep 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+