Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌, లక్ష్మణ్‌లకు అంబుడ్స్‌మన్‌ నోటీసులు

IPL 2019 : Sachin Tendulkar, VVS Laxman Got Notices From BCCI ! || Oneindia Telugu
BCCI issues notices to Sachin Tendulkar, VVS Laxman for conflict of interest

ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గుంగూలీకి అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరిస్తుండడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నోటీసులు పంపాడు.

ఇప్పుడు ఈ సెగ టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్‌ టెందుల్కర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు సైతం తాకింది. భారత జట్టుకు కోచ్‌ నియామకంతో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాల కోసం బీసీసీఐ సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో క్రికెట్‌ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ముగ్గురు క్రికెటర్లు విధులు నిర్వహిస్తున్నా.. జీతాలేమీ తీసుకోవట్లేదు.

బీసీసీఐ సలహా కమిటీలో ఉంటూ.. ముంబయి (సచిన్), సన్‌రైజర్స్‌ (లక్ష్మణ్‌) ఫ్రాంఛైజీల్లో బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారు?. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని సచిన్‌, లక్ష్మణ్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నోటీసులు పంపాడు. మరి సచిన్‌, లక్ష్మణ్‌లు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Story first published: Thursday, April 25, 2019, 10:04 [IST]
Other articles published on Apr 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+