Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రేయస్‌ అయ్యర్‌‌కు బీసీసీఐ బంపర్ ఆఫర్!

టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. అంతేగాక ఐపీఎల్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండనున్నాడు. గాయం తిరిగబెట్టడంతో లీగ్‌కు శ్రేయస్ దూరమవుతాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్‌లో ఆడటానికి ఆసక్తి చూపట్లేదని కారణంతో వారిద్దరికి కాంట్రాక్ట్ తొలిగించారు.అయితే శ్రేయస్‌పై వేటు వేసిన బీసీసీఐ వైఖరిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

BCCI is planning bumper offer to Shreyas Iyer

శ్రేయస్ అయ్యర్‌కు మద్దతుగా మాజీ క్రికెటర్లు, నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్ ఆడటానికి శ్రేయస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడని, ఇంగ్లండ్ సిరీస్ ముందు రంజీట్రోఫీలో అతడు పాల్గొన్నాడని వివరించారు. వన్డే ప్రపంచకప్‌‌లో పాల్గొనడం కోసం పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లను తీసుకుని మరి శ్రేయస్ పాల్గొన్నాడని తెలిపారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించాడని గుర్తు చేశారు. మరోవైపు ఆటకు దూరమైన హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్‌లకు ఏ ప్రాతిపదికన సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ఇచ్చారని ప్రశ్నించారు.

దీంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ గురించి పునరాలోచనలో పడింది. మరోవైపు ఈ నాటకీయ పరిణామల మధ్యనే శ్రేయస్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు. ముంబై తరఫున సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఆడాడు. విదర్భతో జరిగిన ఫైనల్‌లో సెకండ్ ఇన్నింగ్స్ వన్డే తరహాలో 95 పరుగులు చేశాడు. మరోవైపు ఫైనల్‌లో శ్రేయస్‌కు వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో తుదిపోరులో నాలుగు, అయిదు రోజు ఆటలో అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. మార్చి 22 నుంచి జరగనున్న ఐపీఎల్‌కు శ్రేయస్ అందుబాటులో ఉండటం అనుమానమే అని ఇవాళ ఉదయం వార్తలు వచ్చాయి.

అయితే శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మొత్తానికి అతడు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం. ఫైనల్ ఆఖరి రోజు ఆటలో శ్రేయస్ మైదానంలో అడుగుపెట్టనప్పటికీ విదర్భ‌పై విజయానంతం సంబరాలు చేసుకోవడానికి వచ్చాడు. సహచరులతో కలిసి ట్రోఫీని అందుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు.

Story first published: Thursday, March 14, 2024, 21:06 [IST]
Other articles published on Mar 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+