Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేల కోట్ల ట్యాక్స్ కడుతున్న బీసీసీఐ.. ఈ ఏడాది ఎంత చెల్లించిందంటే?

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న బోర్డు ఏది అంటే భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనే చెప్పాలి. ఒకానొక సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కూడా కనీసం జీతం ఇవ్వలేని స్థితిలో ఉన్న బీసీసీఐ.. ఆ తర్వాత అనూహ్యంగా ఎదిగింది. ప్రస్తుతం సంపాదనలో మిగతా క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో నిలిచింది.

మరి సంపాదన పెరిగినప్పుడు ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కూడా పెరుగుతుంది కదా. ఈ లెక్కలను తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఏకంగా రూ.1159 కోట్ల ఆదాయ పన్ను చెల్లించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 37 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

BCCI is paying thousands of crores Income Tax to Government

రాజ్యసభలో ఈ ప్రశ్న తలెత్తగా ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో బీసీసీఐ నుంచి ప్రభుత్వానికి అందిన ఆదాయ పన్ను వివరాలను ఆయన సభకు తెలియజేశారు. బీసీసీఐ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్ల ఆదాయ పన్ను రూపంలో చెల్లించింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2019-2020 కన్నా ఇది కొంత తక్కువ. ఎందుకంటే ఆ సమయంలో బీసీసీఐ రూ.882.29 కోట్లు చెల్లించింది. అంతకుముందు ఏడాదిలో అంటే 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్ల ఆదాయ పన్ను బీసీసీఐ నుంచి వచ్చింది. అది అంతకుముందు 2017-18లో వచ్చిన రూ.596.63 కోట్ల కన్నా చాలా ఎక్కువ.

అంతేకాదు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ ఎప్పుడూ లేనంతగా ఏకంగా రూ.7606 కోట్ల ఆదాయం కళ్లజూసింది. ఈ సొమ్ములో రూ.3064 కోట్లు బోర్డు ఖర్చు పెట్టింది. అంతకుముందు ఏడాదిలో బీసీసీఐ ఆదాయం రూ.4735 కోట్లు కాగా.. ఖర్చు పెట్టింది రూ.3080 కోట్లు కావడం గమనార్హం. అంటే బీసీసీఐ ఆదాయం పెరిగింది కానీ.. ఖర్చులు పెద్దగా పెరగలేదన్నమాట.

Story first published: Wednesday, August 9, 2023, 11:43 [IST]
Other articles published on Aug 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+