
లక్ష్మణ్ రేసులో ఉన్నా..
వీవీఎస్ లక్ష్మణ్ కూడా కోచ్ పదవి కోసం రేసులో ఉన్నారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేకపోవచ్చు. టీమిండియా కోచ్‌గా పునరాగమనం చేయడానికి అనిల్ కుంబ్లే అనాసక్తిగా ఉంటోన్నాడు. మళ్లీ కోచ్‌గా వెళ్లడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఇదివరకే కుంబ్లే ఏడాదికాలం పాటు కోచ్‌గా పని చేశాడు. 2016 నుంచి 2017 మధ్యకాలంలో టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేశాడతను.

రీ ఎంట్రీ డౌటే..
కొంత ప్రతికూల పరిస్థితుల్లో.. అనూహ్యంగా పదవికి రాజీనామా చేశాడు. అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. కుంబ్లే వైదొలగిన తరువాతే రవిశాస్త్రి రెండోసారి కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. ఆయన పదవీ కాలం ముగియబోతోంది. రవిశాస్త్రి కాల పరిమితి ముగిసిన తరువాత మళ్లీ అనిల్ కుంబ్లే రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలొచ్చాయి. దాదాపుగా కుంబ్లే జట్టు కోచ్‌గా నియమితుడు కావడం లాంఛనప్రాయమేననే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అవన్నీ తలకిందులు కానున్నాయి.

కుంబ్లే అనాసక్తి..
కోచ్ పదవి కోసం అనిల్ కుంబ్లే పెద్దగా ఆసక్తి చూపట్లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. 2017లో ఎలాంటి పరిస్థితుల్లో తాను కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో.. అవే పరిస్థితులు ఇంకా జట్టులో ఉన్నాయని కుంబ్లే భావిస్తున్నట్లు చెబుతున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నప్పటికీ.. బీసీసీఐ ఆయన పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. దీనితో విదేశీ కోచ్ కోసం అన్వేషిస్తోన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్యారీ సక్సెప్‌ఫుల్..
కొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నాయి. ఇదివరకు టీమిండియాకు అయిదుమంది విదేశీ మాజీ క్రికెటర్లు కోచ్‌గా పని చేశారు. జాన్ రైట్, గ్రెగ్ ఛాపెల్, గ్యారీ కిర్‌స్టెన్, డంకన్ ఫ్లెచర్ కోచ్‌గా వ్యవహరించారు. డంకన్ ఫ్లెచర్ తరువాత రవిశాస్త్రి కోచ్‌గా అపాయింట్ అయ్యారు. ఆ అయిదుమంది విదేశీ కోచ్‌లల్లో గ్యారీ కిర్‌స్టెన్ సక్సెస్‌ఫుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన హయాంలోనే టీమిండియా ప్రపంచకప్ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. వరుస విజయాలను అదుకుంది.

విదేశీ కోచ్ వైపే..
గ్యారీ కిర్‌స్టెన్ వేసిన పునాదులు ఇంకా బలంగా ఉన్నాయని, అప్పటి దూకుడు జట్టులో ఇంకా కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే- మరోసారి విదేశీయుడికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనె, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రికీ పాంటింగ్ ఢిల్లీ కేపిటల్స్‌కు పని చేస్తోన్నాడు. అతని హయాంలో ఆ జట్టు వరుస విజయాలను అందుకుంటోంది.

సౌరవ్ గంగూలీ కోసమే..
అనిల్ కుంబ్లేను మళ్లీ జట్టు కోచ్‌గా తీసుకుని రావాలనేది బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలి కోరికగా చెబుతున్నారు. ఆయన ఒత్తిడితోనే అనిల్ కుంబ్లేతో బీసీసీఐ సంప్రదింపులు సైతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను ఆయన సున్నితంగా తోసిపుచ్చాడని చెబుతున్నారు. ఇప్పుడున్న జట్టుకు కోచ్‌గా వ్యవహరించడానికి కుంబ్లే పెద్దగా ఆసక్తి చూపట్లేదని సమాచారం. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ హెడ్ కోచ్ పదవి కోసం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
